త్వరలో ‘డర్టీ పిక్చర్’ చూపిస్తా.... నానిపై శ్రీరెడ్డి సంచలనం!
Recommended Video

కాస్టింగ్ కౌచ్ మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్న శ్రీరెడ్డి... తరచూ నాని ప్రస్తావన తెస్తూ సంచలన పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన మరో పోస్టు హాట్ టాపిక్ అయింది. నాని+శ్రీరెడ్డి=డర్జీ పిక్చర్.... త్వరలో రాబోతోంది అని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాని గురించి శ్రీరెడ్డి ఏమైనా సంచలన విషయాలు బయట పెట్టబోతోందా? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
నాని గురించి శ్రీరెడ్డి పోస్ట్
నాని గురించి శ్రీరెడ్డి ఏమైనా ఫోటోలు వీడియోలు బయట పెట్టబోతోందా? నాని+శ్రీరెడ్డి=డర్జీ పిక్చర్... అని పేర్కొనడంతో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

బిగ్ బాస్ 2లో శ్రీరెడ్డి
త్వరలో నాని హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో శ్రీరెడ్డి కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే తెలుగు బిగ్ బాస్ 2 కాంట్రవర్సీలకు ప్రధాన కేంద్రంగా మారడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత
నాకు, నానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మా మధ్య అలాంటి పరిస్థితులు ఉన్నాయి....అంటూ శ్రీరెడ్డి గతంలో బహిరంగంగానే వెల్లడించింది. మరి ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏమిటి? అనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

శ్రీరెడ్డికి టార్గెట్ అయిన నాని!
కాస్టింగ్ కౌచ్ అంశం బయటకు వచ్చినప్పటి నుండి నేచురల్ స్టార్ అంటూ శ్రీరెడ్డి పరోక్షంగా, ప్రత్యక్ష్యంగా అతడిని టార్గెట్ చేస్తూనే ఉంది. రాయడానికి వీల్లేని పదాలను కూడా అతడిపై ప్రయోగించింది. త్వరలో డర్టీ పిక్చర్ బయట పెడతాను అంటున్న ఆమె... ఎలాంటి సంచలనానికి తెరలేపబోతోందో? చూడాలి మరి.


Click it and Unblock the Notifications











