Disaster Vakeel Saab ట్రెండింగ్: పవర్ స్టార్‌ ఫ్యాన్స్ Vs వైఎస్ జగన్ ఫాలోవర్స్.. సోషల్ మీడియాలో వార్..

వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా వార్‌కు దిగుతున్నారు. మహిళా సాధికారిత నేపథ్యంగా వచ్చిన వకీల్ సాబ్‌లో పొలిటికల్ కలర్ కొంత ఎక్కువ కావడంతో ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీకి చెందిన ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పవర్ స్టార్, వైఎస్ జగన్ అభిమానుల మధ్య వార్ ఎలా కొనసాగుతున్నదంటే...

వకీల్ సాబ్ మూవీ తర్వాత

వకీల్ సాబ్ మూవీ తర్వాత

ముఖ్యంగా వైఎస్ జగన్ ఫ్యాన్స్ భారీగా ట్వీట్లు చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌కు ముందు పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేస్తే.. రిలీజ్ తర్వాత అధికార పార్టీల అభిమానులు రెచ్చిపోయినట్టు కనిపిస్తున్నది.

మనపై పీకే ఫ్యాన్స్ ట్రెండ్

మనపై పీకే ఫ్యాన్స్ ట్రెండ్

నిన్న పీకే ఫ్యాన్స్ మన అన్న మీద నెగిటివ్ ట్రెండ్ చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దాం. మనం కూడా ట్రెండ్ స్టార్ చేద్దాం. అందుకు #DisasterVakeelSaab ట్యాగ్‌ను తీసుకోండి అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.

వకీల్ సాబ్ అట్టర్ ఫ్లాప్ అంటూ

వకీల్ సాబ్ అట్టర్ ఫ్లాప్ అంటూ

దుబాయ్‌లో ఇంటర్వెల్ తర్వాత వకీల్ సాబ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్. పవన్ కల్యాణ్ యాక్టింగ్ బిగ్ మైనస్ అంటూ కామెంట్ చేస్తూ.. బండ్ల గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన డైలాగ్‌కు పేరెడిగా ఈశ్వరా పవనేవ్వరా.. రాడ్డేశ్వరా అంటూ #DisasterVakeelSaab ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

శ్రీరెడ్డికి రెస్పెక్ట్ ఇవ్వండి

శ్రీరెడ్డికి రెస్పెక్ట్ ఇవ్వండి

వకీల్ సాబ్ చిత్రం మహిళలకు చూపించాల్సిన, చూడాల్సిన సినిమా అంటూ పవర్ స్టార్ అభిమానులు ట్వీట్ చేస్తే అందుకు వ్యతిరకంగా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే మీ పీకే ఫ్యాన్స్‌ ఫస్ట్ శ్రీరెడ్డికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ తర్వాతే సినిమా గురించి ఆలోచిద్దాం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

 పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్

పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్

వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ పవన్ కల్యాణ్‌పై విరుచుకు పడుతున్నారు. పవర్ స్టార్‌ను ఉద్దేశించి దారుణమైన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ మంచి నటి. 2014 నుంచి ఆమె యాక్టింగ్ స్కిల్స్ చూస్తున్నాను. జనసేన అంటే యాక్టింగ్‌కు రిహార్సల్ ఆఫీస్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఈ ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్ అంటూ

ఈ ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్ అంటూ

వకీల్ సాబ్ డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేస్తున్న తీరుపై సగటు సినిమా అభిమాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. #DisasterVakeelSaab ఎందుకు ట్రెండ్ అవుతున్నదో అర్ధం కావడం లేదు. వకీల్ సాబ్ సినిమా బాగుంది. డిజాస్టర్ కాదు. అత్తారింటికి దారేది తర్వాత మంచి సినిమా అని చెప్పవచ్చు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

పవన్ కల్యాణ్ నటనే దారుణంగా

పవన్ కల్యాణ్ నటనే దారుణంగా


వకీల్ సాబ్ సినిమా ఇప్పుడే చూశాను. నివేదా థామస్, అంజలి బాగా నటించారు. పవన్ కల్యాణ్ నటనే దారుణంగా ఉంది. #DisasterVakeelSaab అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

Recommended Video

Vakeel Saab Review : Pawan Kalyan పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్... సమస్యలను వేలెత్తి చూపించే కంటెంట్!!
వైఎస్ జగన్ ఫ్యాన్స్ అందరూ

వైఎస్ జగన్ ఫ్యాన్స్ అందరూ

వైఎస్ జగన్ ఫ్యాన్స్ అందరూ మాస్‌గా రీట్వీట్స్ కొట్టండి. వకీల్ సాబ్ సినిమా ఫ్లాఫ్ అయి.. 50 కోట్లు నష్టం వచ్చేదాక ట్రెండ్ చేస్తూనే ఉండండి. #DisasterVakeelSaab అంటూ మరొ నెటిజన్ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X