'డిస్కో రాజా' ఫస్ట్‌టాక్: ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఎలా ఉందంటే..
Recommended Video
సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు 'డిస్కొరాజా' అయ్యాడు. గత కొంతకాలంగా సరైన హిట్ పడకపోవడంతో ఈ సారి వైవిధ్యభరితమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ మేరకు వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కొరాజా' సినిమా పూర్తిచేసి రంగంలోకి దిగాడు. ఈ రోజే (జనవరి 24) ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్‌లో షో పడటంతో అక్కడి జనం సినిమాపై తమ అభిప్రాయలు చెబుతున్నారు. వివరాల్లోకి పోతే..

సైన్స్ ఫిక్షన్ డ్రామా.. రవితేజ నటన
సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'డిస్కో రాజా' మూవీలో రవితేజ నటన కాస్త కొత్తగా అనిపించిందని అంటున్నారు ఆడియన్స్. ఆయన కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ రకమైన పాత్రలో కూడా రవితేజ తన నటనతో అలరించారని జనం మాట.

మాస్ మహా రాజాకు హిట్ పక్కా..
డైరెక్టర్ వీఐ ఆనంద్ తెరకెక్కించిన తీరు బాగుందని టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాను రవితేజ ఇమేజ్‌కు తగ్గట్లు రాసుకున్నాడని అంటున్నారు. మాస్ మహా రాజాకు ఈ సినిమా హిట్ ఇస్తుందని ఎక్కువమంది చెబుతున్నారు. సినిమాలో రవితేజ యాక్టింగ్, కామెడీ బాగుందని చెబుతున్నారు.

ముగ్గురు హీరోయిన్స్‌తో రవితేజ
ముఖ్యంగా చిత్రంలో రవితేజ, బాబీ సింహా నటన సినిమాకు హైలైట్‌గా ఉందని అంటున్నారు. ముగ్గురు హీరోయిన్స్ నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ లతో రవితేజ రొమాన్స్ కిక్కిచ్చిందని యూత్ ఆడియన్స్ అంటున్నారు.

సునీల్ కామెడీ.. ప్రయోగాత్మక కథ
చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో అదరగొట్టాడని అంటున్నారు. సునీల్ కామెడీ సినిమాకు ప్రధాన బలం అంటున్నారు. ప్రయోగాత్మక కథను డైరెక్టర్ విఐ ఆనంద్ చాలా వినోదాత్మకంగా తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. థమన్ సంగీతం ప్లస్ అయిందని అంటున్నారు.

ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా
ఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం చూస్తుంటే ముందు సినిమాలతో పోలిస్తే బెటర్ ఔట్‌పుట్‌తో మాస్ రాజా రవితేజ ప్రేక్షకుల ముందుకొచ్చారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ సాధిస్తుందో!.


Click it and Unblock the Notifications











