శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి పరిస్థితి విషమం!
హైదరాబాద్: ఒకప్పటి ప్రముఖ తెలుగు నటి, దివంగత రియల్ స్టార్ శ్రీహరి భార్య డిస్కోశాంతి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, క్రిటికల్ గా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె లివర్ కు సంబందించిన సమస్యతో సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అనే వార్త వినిపిస్తున్నాయి.
ఇంటి పెద్ద దిక్కు శ్రీహరి మరణించినప్పటి నుండి డిస్కో శాంతి మానసికంగా చాలా కృంగి పోయిందని, ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీహరి కుటుంబ పరిస్థితి ఇలా తయారు కావడంపై రియల్ స్టార్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.



Click it and Unblock the Notifications











