బావకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు, ఛీ కొట్టి వదిలేశా: డిస్కో శాంతి
దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరికి ఇండస్ట్రీలో చాలా మంది డబ్బులు ఎగ్గొట్టేవారని, ఆయన మరణించిన తర్వాత అప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు సంబంధించి రెమ్యూనరేషన్‌గా రావాల్సిన డబ్బు చాలా మంది ఇవ్వకుండా ముఖం చాటేశారనే వాదన ఉంది. ఈ అంశంపై శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
బావ ముందు నుంచి డబ్బులకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. ఆయన రూపాయికి డీల్ మాట్లాడితే... 20 పైసలు తీసుకుని 80 పైసలు వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ అంతే. లేకుంటే ఇలాంటి బిల్డింగులు, ఆస్తులు చాలా చాలా ఉండేవి... అని డిస్కో శాంతి తెలిపారు.

వాల్లను ఛీ కొట్టి వదిలేశా
మా నాన్న కూడా ప్రొడ్యూసర్. వాళ్లు కష్టాలు నేను దగ్గరుండి చూశాను. సినిమా కోసం దర్శక నిర్మాతలు చాలా కష్టపడతారు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. సినిమా ఆడక పోతే చాలా నష్టం వస్తుంది. నేను కూడా ఇలాంటి విషయాలను లైట్ తీసుకునే దాన్ని. ఇద్దరి ముగ్గురి దగ్గరకు డబ్బుల కోసం పంపించాను. ఇవ్వని వారిని చీపో అని వదిలేశాను... అని డిస్కో శాంతి గుర్తు చేసుకున్నారు.

బావ ఉన్నపుడు చాలా సందడిగా ఉండేది
పిల్లలు పుట్టినప్పటి నుంచి వారే నా ప్రపంచం. ఉదయం 5 గంటలకు లేచి బావకు పాలు కలిపి ఇచ్చి... పిల్లలకు వంట చేయడం, వాళ్లను స్కూలుకు పంపడం, బావకు ఫుడ్ రెడీ చేసి పెట్టడం ఇలా నా లైఫ్ స్టైల్ సాగిపోయేది. ఇంట్లో ఉన్నపుడు బావ చాలా కామెడీ చేసేవారు, నవ్వించే వారు, ఇంటికి అందరూ వచ్చేవారు... సందడిగా ఉండేదని డిస్కోశాంతి గుర్తు చేసుకున్నారు.

వాళ్లు కూడా డబ్బుల విషయంలో ఏమీ చేయలేకపోయారు
బావకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బావ పోయిన తర్వాత ఆయనకు రావాల్సిన డబ్బుల విషయంలో వారు కూడా ఏమీ చేయలేక పోయారు. కొంత మంది నిర్మాతలు కావాలనే డబ్బులు ఎగ్గొట్టారు. ఆ విషయం నేను సీరియస్‌గా తీసుకోకుండా మీ కుటుంబంతో సుఖంగా ఉండండి అని వదిలేశాను... అని డిస్కో శాంతి తెలిపారు.

శ్రీహరి తనయుడు హీరోగా
శ్రీహరి తనయుడు మేఘాంశ్ త్వరలో హీరోగా లాంచ్ కాబోతున్నాడు. 'రాజ్‌దూత్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











