శ్రియా దస్తులపై అసెంబ్లీలో చర్చ

హీరోయిన్ శ్రియా కురుచ దస్తులపై తమిళనాడు శాసనసభలో మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. శివాజీ విజయోత్సవ సభకు నైట్ గౌన్ లాంటి దుస్తుల్లో శ్రియా రావడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పిఎంకె సభ్యులు శాసనసభలో ప్రస్తావిస్తూ తారలు ధరించే దుస్తులను నియంత్రిస్తూ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అశ్లీలానికి కొలమానాలను నిర్ధారించలేమని, స్త్రీలు ఎంత వరకు ఎక్స్ పోజు చేయవచ్చో, వారు ఎటువంటి దుస్తులు ధరించాలో మనం చెప్పలేమని ప్రజాపనుల శాఖ మంత్రి దురై మురగన్ అన్నారు.


Click it and Unblock the Notifications











