Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బన్నీ డ్యాన్సులకు లోఫర్ భామ ఫిదా.. అలా ఎలా అంటూ ఆశ్చర్యం.. అల్లు అర్జున్ స్టైలీష్ రిప్లై
ఆంధ్ర మైఖేల్ జాక్సన్‌గా పిలుచుకునే అల్లు అర్జున్ డ్యాన్సులకు పడిపోని వారెవరూ ఉండరు. అల్లు అర్జున్ వేసే స్టైలీష్ స్టెప్పులు, ఆ గ్రేస్ వేరే లెవెల్. సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నా బన్నీ స్టెప్పులు మాత్రం ఉండాల్సిందే. అందుకే ప్రతీ సినిమాలోనూ సాంగ్స్, కొరియోగ్రాఫర్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతుంటాడు బన్నీ. రీసెంట్గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని పాటలు, బన్నీ స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బన్నీ స్టెప్పులకు లోఫర్ ఫేమ్ దిశా పఠానీ ఫిదా అయిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ బన్నీ కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
లాక్ డౌన్ నేపథ్యంలో..
కరోనా వైరస్ ధాటికి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదని, అందరూ ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంతో సినీ తారలు సైతం ఇంట్లోనే ఉంటూ అందరికీ కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు.
ఇంటి పట్టునే ఉంటూ..
ఇంటి పట్టునే ఉంటూ వినోద కార్యక్రమాలు చూసుకుంటూనో, వర్కౌట్లు చేసుకుంటూనో, ఫ్యామిలీతో సరదగా గడపడమో చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో దిశా పఠానీ అల వైకుంఠపురములో సినిమాను వీక్షించినట్టు తెలుస్తోంది. దేశం మొత్తం ట్రెండ్ అల వైకుంఠపురములో చిత్రానికి, అల్లు అర్జున్ డ్యాన్సులకు దిశా ఫిదా అయిపోయింది.
బుట్టబొమ్మ స్టెప్పులకు షాక్..
బుట్ట బొమ్మ పాట ఎంతగా వైరల్ అయిందో, ఆ స్టెప్పులు ఎంతగా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అందర్నీ ఆకట్టుకున్న బుట్టబొమ్మ స్టెప్పులు తాజాగా దిశా పఠానీని కట్టిపడేసింది. అలా ఎలా చేస్తారంటూ షాక్‌కు గురైంది.
బన్నీ కూల్ రిప్లై..
దిషా పఠానీ పొగుడుతూ చేసిన పోస్ట్‌కు స్పందించిన బన్నీ.. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని, మంచి సంగీతం వింటే చాలు సహజంగానే డ్యాన్స్ వచ్చేస్తోందని చెప్పుకొచ్చాడు. మీరిచ్చిన కాంప్లిమెంట్‌కు ధన్యవాదాలని పేర్కొన్నాడు. మా అందరిలో ఇలా స్ఫూర్తి నింపుతున్నందుకు ధన్యవాదాలంటూ దిశ రిప్లై ఇచ్చింది.