లోఫర్ హీరోయిన్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. మరో ఇద్దరికి కూడా
ప్రస్తుతం కరోనా వైరస్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలలో కూడా ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఇక రీసెంట్ గా స్టార్ హీరోయిన్ ఫ్యామిలీలో కూడా ఒకరు కరోనా భారిన పడ్డారు. ముందుగా హీరోయిన్ తండ్రి కూడా కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది.

దిశా పటానీ తండ్రికి కరోనా
ఆ హీరోయిన్ మరెవరో కాదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ. అయితే దిశా తండ్రి జగదీష్ కి ఈ రోజు కరోనా పాజిటివ్ అని వచ్చినట్లు నిర్దారణ అయ్యింది. దిశా తండ్రి పవర్ డిపార్ట్ మెంట్‌లో విజిలెన్స్ విభాగంలో డిప్యూటీ ఎస్పీగా పనిచేస్తున్నారు.

ఆయనతో పాటు మరో ఇద్దరికి
అయితే ఇటీవల ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులు ట్రాన్స్ ఫార్మా కుంభ కోణం దర్యాప్తు కోసం లక్నోకు వెళ్లారు. అనంతరం బరెలీకి వచ్చే తరుణంలో కొంత అస్వస్థతకు గురైన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం వెలువడిన రిపోర్ట్స్ లో దిశా తండ్రితో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కరోనా పాజిటివ్ అని తెలియగానే
కరోనా పాజిటివ్ అని తెలియగానే జగదీష్ ని అలాగే మరికొంత మంది అధికారులను క్వారంటైన్ లోకి పంపించారు. ఇక ఈ విషయంపై దిశకు చాలా ఫోన్ కాల్స్ వస్తుండగా ఆమె కొంత ఆందోళనకి గురైనట్లు తెలుస్తోంది. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదని ప్రస్తుతం కోవిడ్ లక్షణాలు కూడా పెద్దగా లేవని సన్నిహితులు చెబుతున్నారు.
Recommended Video

ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు
కానీ క్వారంటైన్ లోనే వైద్యులు 15రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక దిశా కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. వారి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. ఇటీవల సింగర్ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











