twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడిగితే గుండుకొట్టించుకోవటానికి సిద్దం: హీరోయిన్ ఆన్సర్‌కి దిమ్మ తిరిగిపోయింది

    ఒక్క సారి ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగంటూ పెట్టాక ఏదీ దాచుకోకూడదని అర్త్మయ్యిందేంటూ రాశీ ఖన్నా చెప్పిన విషయం గుర్తుందా? మొదట్లో అందాలన్నీ దాచుకొని నటించటం ఎంత తప్పో తెలిసొచ్చిందనీ ఆ పరిమితులు.

    |

    ఒక్క సారి ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగంటూ పెట్టాక ఏదీ దాచుకోకూడదని అర్త్మయ్యిందేంటూ రాశీ ఖన్నా చెప్పిన విషయం గుర్తుందా? మొదట్లో అందాలన్నీ దాచుకొని నటించటం ఎంత తప్పో తెలిసొచ్చిందనీ ఆ పరిమితులు ఇప్పుడు పెట్టుకోదలచుకోలేదని చెప్పింది రాశీఖన్నా. ఊహలు గుసగుస లాడే లాంటి సినిమాల్లో అసలు ఎక్స్పోజింగ్ అనే మాట లేకుండానే లాక్కొచ్చింది గానీ తర్వాత తర్వాత అసలు విషయం గ్రహించింది. ఇక్కడ స్కిన్ షో చేయనిదే ఫ్యూచర్ ఉండదనే విషయం అర్థం అవగానే వెంటనే సర్దుకుంది. ఆ మార్పు హైపర్ ఆడియో ఫంక్షన్ లోనే కనిపించింది.

    సగం సగం బట్టలతోనే ఆన్ స్క్రీన్ మీదే కాదు బయటకూడా కనిపించటం మొదలు పెట్టింది. అదే తరహాలో ఇప్పటితరం హీరోయిన్లు తెరపై గ్లామరస్‌గా కనబడాల్సిందే. ఇక, బాలీవుడ్‌ హీరోయిన్లకైతే గ్లామరే ప్రధాన ఆయుధం. అంటూ ఇప్పటిదాక ఓపెన్ సీక్రెట్ గా ఉన్న విషయాన్నే బహిరంగంగా అంగీకరించింది 'లోఫర్‌' బ్యూటీ దిశాపటాని.

    Disha Patani ready to go bald for a role,

    సోషల్ మీడియాలో మోస్ట్ సెర్చిడ్ పాపులర్ హీరోయిన్ గా ఎదుగుతోంది దిశా పటాని. తెలుగు లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సంవత్సరం తిరగకముందే బాలీవుడ్ లో రెండు సినిమాలను దక్కించుకుంది. అందులో ఒకటి ఇండియన్ క్రికెట్ దిగ్గజం ధోని బయోపిక్ "ధోని ది అన్ టోల్డ్ స్టోరీ" మూవీ. ఆ సినిమా లో చేసింది చిన్న పాత్రే అయినా అమ్మడు మంచి నటనతో ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో ఈ అమ్మడికి ఓ వినూత్న ప్రశ్న ఎదురైంది.

    ప్రస్తుతం బి-టౌన్ కి చెందిన కొందరు హీరోయిన్స్ ఎందుకు కొత్త తరహా పాత్రలతో కనిపించడం లేదు. ముఖ్యంగా గ్లామర్ పాత్రలను వదిలి గుండు కొట్టించుకోవడం లాంటి ప్రయోగాలు ఎందుకు చేయలేరు అని ఆగడంతో.. ఈ అమ్మడు అలాంటి పాత్రలు చేయకపోవడానికి కారణం ''కొంతమంది హీరోయిన్స్ ని ప్రేక్షకులు తక్కువ స్థాయిలో చూడాలి అనుకోరు. కొందరు హీరోయిన్స్ కూడా అందుకు ఎక్కువగా ఇష్టపడరు. నాకు అయితే అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా గుండు కొట్టించుకుంటా.. కాకపోతే అందుకు తగ్గట్టుగా ఒక బలమైన స్క్రిప్ట్ ఉంటేనే.. అలాగే అలాంటి పాత్ర అవసరం అనుకుంటేనే ఎలాంటి ప్రయోగాలకైనా సిద్దం'' అంటోంది 'లోఫర్' ప్రేక్షకులతో తెలుగువారికి తన గ్లామర్ టచ్ ఇచ్చిన దిశా పటానీ.

    English summary
    Disha Patani says if she feels that going bald for a role will "benefit the narrative" of a project, she might go ahead with it..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X