400 కోట్ల బడ్జెట్‌తో దిశా పటానీ మూవీ.. ఆగస్టులో సెట్స్‌పైకి!
Recommended Video

తమిళంలో ఇప్పటివరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న సంఘమిత్ర చిత్రం త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నది. బాలీవుడ్ శృంగార తార దిశా పటానీ యుద్ధనారీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సీ రూపొందించే ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

రూ.400 కోట్ల బడ్జెట్
సంఘమిత్ర చిత్రం కనీవిని ఎరుగని రీతిలో సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నది. యుద్ధ నేపథ్యంగా సాగే ఎమోషనల్ డ్రామాగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రాన్ని థెనండాల్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్నది.

హైదరాబాద్‌లో భారీ సెట్
సంఘమిత్ర చిత్రం కోసం హైదరాబాద్‌తో ఓ భారీ, విలాసవంతమైన సెట్‌ను ఇప్పటికే రూపొందించారు. ఈ సెట్స్‌లోనే ఈ చిత్రం నిరంతరంగా షూటింగ్ జరుపుకొంటుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కీలక పాత్రలను పోషిస్తున్నారు.

కేన్స్‌లో ఫస్ట్ లుక్
వాస్తవానికి సంఘమిత్ర చిత్రం 2017 ఆరంభంలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మొదట ఈ సినిమాలో టైటిల్ పాత్ర కోసం శృతిహాసన్ ఎంపిక చేశారు. అయితే ఆమె అనూహ్యంగా ఈ చిత్రం నుంచి తప్పుకోవడం కొంత ఆలస్యమైంది.

సంఘమిత్రంపై శృతి హాసన్ అసంతృప్తి
సంఘమిత్ర విషయంలో దర్శకుడి, చిత్ర యూనిట్‌పై శృతిహాసన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంఘమిత్ర చిత్ర స్క్రిప్టు పూర్తి కాలేదు. మరో రెండు సంవత్సరాలపాటు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు అని ఆరోపిస్తూ శృతి హాసన్ తప్పుకోవడం వివాదంగా మారింది. శృతిహాసన్ ఆరోపణలను దర్శకుడు సుందర్‌తోపాటు ఆయన సతీమణి కుష్బూ కూడా ఖండించారు.


Click it and Unblock the Notifications











