అలా జరిగింది.. సాయం చేయండంటూ అకౌంట్ నెంబర్ షేర్ చేసిన వర్మ.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే!

ఇటీవలే చోటుచేసుకున్న 'దిశ' ఘటన దేశవిదేశాలను వణికించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఈ ఘటన గురించి తెలిసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజానీకం ఉలిక్కిపడింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో నిందితులైన నలుగురు యువకులను ఎన్‌కౌంటర్ చేయడంతో విషయం సద్దుమణిగింది. అయితే తాజాగా ఈ నలుగురిలో ఓ నిందితుడి భార్య ఆడ బిడ్డకు జన్మనివ్వడం, దానిపై వర్మ రియాక్ట్ కావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

చెన్నకేశవులు భార్య డెలివరీ

చెన్నకేశవులు భార్య డెలివరీ

దిశ ఘటన నిందితుడు చెన్నకేశవులు గతేడాది డిసెంబర్ 6న షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌‌లో మరణించే నాటికి అతడి భార్య 6 నెలల గర్భవతి. ఇప్పుడు నెలలు నిండటంతో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చెన్నకేశవులు భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. వారి భవిష్యత్తే క్షేమం కాదు

రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. వారి భవిష్యత్తే క్షేమం కాదు

ఈ నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్ని తెలుపుతూ.. ''చెన్నకేశవులు భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమమే. క్షేమంకాని అంశం ఏమిటంటే.. వారి భవిష్యత్తే. ఎందుకంటే వారిపై రేపిస్టుల వికారమైన నీడ ఉంది. వారిని సాయం చేయండి'' అంటూ ట్వీట్ చేశారు.

 నెటిజన్స్ కామెంట్స్

నెటిజన్స్ కామెంట్స్

ఈ మేరకు బ్యాంక్ ఖాతా వివరాలు ‘A/c No 918010050607980, AXIS BANK, IFSC code: UTIB0001454' కూడా షేర్ చేశారు వర్మ. దీంతో ఈ విషయమై చాలామంది నెటిజన్స్ స్పందించారు. కొందరు ఆర్ధిక సాయం అందించగా, ఇంకొందరు గ్రేట్ జాబ్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పోలీసులపై చెన్న కేశవులు భార్య ఆరోపణలు

పోలీసులపై చెన్న కేశవులు భార్య ఆరోపణలు

చెన్న కేశవులు ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత.. పోలీసులు తన భర్తను అన్యాయంగా చంపేశారని ఆరోపిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు దిక్కెవరంటూ కంటతడి పెట్టి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

Recommended Video

Mega Star Chiranjeevi Emotional On Disha Issue ||

దిశ ఘటన.. వర్మ సినిమా

ఇకపోతే దిశ ఘటనపై తాను సినిమా రూపొందిస్తానని వర్మ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చెన్న కేశవులు భార్యతో మాట్లాడి వివరాలు సేకరించిన ఆయన ఇటీవలే శంషాబాద్ పోలీసుల నుంచి కూడా ఘటన తాలూకు సమాచారం తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X