సూసైడ్‌కు ముందు సుశాంత్‌కు దిశా సలియాన్ ఫోన్.. ఆ రోజు పార్టీలో గొడవ.. రియా చక్రవర్తి ఫైట్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మేనేజర్ దిశా సలియాన్ మరణం వెనుక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన డిబేట్‌లో సామాజిక కార్యకర్త ప్రశాంత్ దిగ్బ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. ఈ చర్చలో ప్రశాంత్ మాట్లాడుతూ..

దిశా సలియాన్ ఫ్రెండ్ చెప్పిన ప్రకారం..
దిశా సలియాన్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేశారు. దిశ మరణం వెనుక చాలా సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఆ విషయాలు నేను బయటపెట్టాలని అనుకొన్నాను. కానీ నేను వాటిని బయటపెట్టి ప్రశాంతంగా బతకలేను. కాబట్టి నేను నీతో పంచుకోవాలని చెప్పారు అని ప్రశాంత్ చెప్పారు.

దిశా పాల్గొన్న పార్టీలో గొడవ
జూలై 8వ తేదీన దిశా సలియాన్ ఓ పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఆ పార్టీలో దిశా సలియాన్‌తో కొందరు గొడవ పడ్డారు. ఆ గొడవ పెద్దగా కావడంతో అక్కడి నుంచి బయటకు వచ్చి సుశాంత్‌కు కాల్ చేశారు అని దిశా సలియాన్ ఫ్రెండ్ తనకు చెప్పారని ప్రశాంత్ డిబేట్‌లో వెల్లడించారు.

సుశాంత్‌కు దిశ ఫోన్ చేస్తే
దిశా ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన సుశాంత్.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. ఆ తర్వాత గంట సేపటి తర్వాత సుశాంత్‌కు సందీప్ కాల్ చేసి.. దిశా సలియాన్ సూసైడ్ చేసుకొన్నదనే విషయాన్ని ఆయనకు చెప్పారు. ఆ తర్వాత సుశాంత్ షాక్ గురయ్యారు అని ప్రశాంత్ తెలిపారు.

దిశ మరణం తర్వాత సుశాంత్‌తో రియా గొడవ
జూలై 8వ తేదీ తర్వాత దిశా సలియాన్ మరణించిన తర్వాత రియా చక్రవర్తి, సుశాంత్ మధ్య గొడవ జరిగింది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత సుశాంత్‌ను వీడి రియా చక్రవర్తి వెళ్లిపోయింది. ఆమె ఫ్యామిలీ భారీ సూట్‌కేసులతో వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సంగతి తెలిసిందే.
Recommended Video

దిశ మరణం కేసు ఫైల్ ధ్వంసం
ఇలాంటి విభిన్నమైన కథనాల నేపథ్యంలో దిశా సలియాన్ కేసును దర్యాప్తు చేస్తే సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే వాదన సోషల్ మీడియాలో వినిస్తున్నది. ఈ క్రమంలో దిశా సలియాన్ మరణానికి సంబంధించిన ఫైల్ ధ్వంసం చేశామని ముంబై పోలీసులు వెల్లడించడం అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నది.


Click it and Unblock the Notifications











