దిశ మరణానికి ముందు సుశాంత్‌కు ఫోన్.. పెంట్‌హౌస్‌లో ఏం జరిగింది? ఆ నేతలు, బడాబాబులు ఎవరు?

సుశాంత్ సింగ్ మరణం వెనుక వాస్తవాలను బయటపెట్టేందుకు రిపబ్లిక్ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దిశ సలియాన్ మరణానికి సుశాంత్ మృతికి సంబంధముందనే అనుమానాలకు బలం చేకూరుతున్నది. తాజాగా సుశాంత్ ఫ్రెండ్ మీడియాకు చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నది. సుశాంత్‌ది సూసైడ్ కాదా? సుశాంత్‌ను ఎవరైనా చంపారా? అనే సందేహాలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ ఫ్రెండ్‌గా భావిస్తున్న ఓ వ్యక్తి రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ..

Recommended Video

Sushant Singh Rajput కు మరణానికి ముందు ఫోన్ చేసిన Disha, జూన్ 13 న ఆ పార్టీలో ఏదో జరిగింది?
దిశా మరణానికి ముందు పార్టీ

దిశా మరణానికి ముందు పార్టీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ జూలై 8వ తేదీన ఓ పార్టీలో పాల్గొన్నది. అయితే ఆ పార్టీలో జరిగిన గొడవలు ఆమె మరణానికి దారి తీసాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆమె తన ప్రాణాలు తీసుకోవడానికి దారి తీసిన కారణాలు ఏమిటనే దిశగా చర్చ జరుగుతున్నది.

పెంట్‌హౌస్‌కు రమ్మని ఒత్తిడి

పెంట్‌హౌస్‌కు రమ్మని ఒత్తిడి

ముంబైలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీలో భాగంగా కొందరు దిశా సలియాన్ పెంట్‌హౌస్‌కు రమ్మని పలిచారు. అయితే ఆమె అక్కడికి రానని చెప్పింది. ఆ పార్టీలో చాలా మంది రాజకీయ నేతలు, సినీ తారలు ఉన్నారు. అయితే అక్కడి వెళ్లడానికి నిరాకరించిన దిశా సలియాన్ సుశాంత్‌కు ఫోన్ చేసింది అని స్నేహితుడు చెప్పారు.

సుశాంత్‌కు దిశ సలియాన్ ఫోన్

సుశాంత్‌కు దిశ సలియాన్ ఫోన్

సుశాంత్‌తో చాలా సేపు ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. అయితే అక్కడి నుంచి దిశాను వెళ్లిపోమ్మని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో నాకు ఫోన్ చేసి కనెక్ట్ చేయమని చెప్పారు. అయితే అప్పటికే ఆమె మరణించారు. ఆ విషయం సుశాంత్‌కు తెలియదు అని సుశాంత్ ఫ్రెండ్ తెలిపారు.

సుశాంత్ నోట 50 సార్టు సందీప్ పేరు

సుశాంత్ నోట 50 సార్టు సందీప్ పేరు

అయితే సుశాంత్ తనతో మాట్లాడుతూ దిశకు జరిగిన విషయాలను బయటపెట్టేందుకు ప్రెస్ మీట్ నిర్వహించాలని అనుకొన్నారు. అయితే తనతో జరిగిన 22 నిమిషాల సంభాషణలో 50 సార్లు సందీప్ సింగ్‌ పేరు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి నిజాలు బయటకు చెప్పాలని సందీప్ సింగ్‌కు చెప్పారు అని సుశాంత్ స్నేహితుడు రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 ఆ ముగ్గురికి తెలుసు

ఆ ముగ్గురికి తెలుసు

దిశా సలియాన్ మరణం తర్వాత సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మానసికంగా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ తర్వాత మీడియాకు చాలా విషయాలు చెప్పాలనుకొన్నారు. సందీప్ సింగ్, సిద్ధార్థ పితాని, రియా చక్రవర్తికి చాలా విషయాలు తెలుసు. వారిని విచారిస్తే సుశాంత్ ఏం చెప్పాలనుకొన్నారనే విషయాలు బయటకు వస్తాయి అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X