సుశాంత్ మృతికి నా కూతురు సుసైడ్‌కు లింక్.. దిశ సలియాన్ తల్లి.. సీబీఐకి అప్పగించాలంటూ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసు ఎన్నో మలుపులు తిరుగుతున్నది. తాజాగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ పెరుతుండటంతో దిశ సలియాన్ తల్లి మౌనం వీడి సంచలన ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. సుశాంత్ మరణానికి కొద్ది రోజుల ముందు దిశ సలియాన్ సూసైడ్ చేసుకోవడం తెలిసిందే. కొద్ది రోజులుగా మౌనం దాల్చుతున్న దిశ కుటుంబం ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి పలు విషయాలు వెల్లడించారు. దిశ తల్లి వెల్లడించిన విషయాలు..
Recommended Video

సుశాంత్ మేనేజర్ దిశ సలియాన్ సూసైడ్
ఐశ్వర్యరాయ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి ప్రముఖులకు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలియాన్ జూన్ 8వ తేదీన ముంబై మలాడ్‌లోని 14వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత సూసైడ్‌గా భావించినప్పటికీ.. దానిని అనుమానాస్పద కేసుగా రిజిస్టర్ చేశారు. అయితే దిశ మరణం తర్వాత జూన్ 14వ తేదీన సుశాంత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే.

దిశ సలియాన్ ఫైల్స్ ధ్వంసం
ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో దిశా సలియాన్ మరణం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. సుశాంత్, దిశ మరణానికి లింకు ఉందనే వాదనను పలువురు వినిపిస్తున్నారు. పలు సందేహాల మధ్య దిశ కేసును విస్మరించలేమని చెబుతున్నారు. అయితే దిశ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ధ్వంసం చేశామని ముంబై పోలీసులు చెప్పడంపై పలు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దిశ, సుశాంత్ కేసులను సీబీఐకి
సుశాంత్, దిశ సలియాన్ మరణాలపై ప్రముఖ నటి, టెలివిజన్ హోస్ట్ సిమి గారేవాల్ సంచలన ట్వీట్ చేశారు. దిశ సలియాన్, సుశాంత్ కేసులను సీబీఐ విచారణకు అప్పగించాలి. వారిద్దరి మరణాలకు ఏదో సంబంధం ఉంది. దిశ సలియాన్ కేసును తప్పనిసరిగా విచారించాలి. ఆ కేసును ఎందుకు విస్మరిస్తున్నారు? దిశ కేసును విచారిస్తే సుశాంత్ హత్య వెనుక కుట్ర బయట పడుతుంది అంటూ సిమీ గారేవాల్ తన అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

దిశ మరణం తర్వాత నన్ను వదలరని..
దిశ మరణం తర్వాత జరిగిన విషయాలను రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో సుశాంత్ ఫ్యామిలి ఫ్రెండ్ స్మిత పారిఖ్ కూడా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దిశ మరణంతో కలత చెందడమే కాకుండా.. సుశాంత్ ప్రాణభయంతో అల్లాడారు. తన సోదరి మీతూ సింగ్‌కు ఫోన్ చేసి నన్ను కూడా వదలరు అని చెప్పారు. దిశా మరణం కేసులో తన పేరును లాగడంపై సుశాంత్ భయానికి లోనయ్యారు. దిశ మరణం తర్వాత తీవ్రమైన ఆందోళనకు లోనయ్యారు అని స్మిత పారిఖ్ చెప్పారు.

మరణాలపై దిశ తల్లి అనుమానాలు
ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురు దిశా సలియాన్‌కు, సుశాంత్ సింగ్ మరణానికి లింకు ఉండే అవకాశం లేకపోలేదు అని దిశ తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్‌తో పనిచేస్తున్నట్టు ఎప్పుడూ తన కూతురు చెప్పలేదని, ఒకసారి మాత్రమే కలిసినట్టు చెప్పారు. దిశ మరణం తమను తీవ్ర విషాదానికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే ఆ విషయం నుంచి బయటపడుతున్నాం అని దిశ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరినీ వదిలిపెట్టమని దిశ తల్లి
ఒకప్పుడు దిశ మాకు బలహీనతగా మారింది. ఇప్పుడు దిశ బతికిలేదనే విషయం మాలో ధైర్యాన్ని కలిగిస్తున్నది. ఆమె మాకు దూరమైన నేపథ్యంలో దిశ మరణానికి ఎవరైనా బాధ్యులని తెలిస్తే మరింత ధైర్యంగా బయటపెడుతాం. ఎవరినీ వదిలిపెట్టే సమస్యే ఉండదు అని దిశ తల్లి మీడియాతో అన్నారు. అంతేగానీ దిశ మరణంపై నిందలు వేస్తే సహించబోమని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











