ఖలేజా టైటిల్ మహేష్ కాదు, మాదంటున్న నిర్మాత
మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా టైటిల్ పై వివాదం ప్రారంభమైంది. ఖలేజా టైటిల్ తమదేనని నిత్యశ్రీ ప్రొడక్షన్స్ ఓ ప్రకటనలో చెప్పుకుంది. ఆదివారంనాడు విడుదల చేసిన ఆ ప్రకటనలో చిత్ర నిర్మాత ఎస్. విజయభాస్కర్ రెడ్డి... మా బ్యానర్‌లో ఎప్పుడో ఛాంబర్‌లో టైటిల్ రిజిస్టర్ చేశామని అన్నారు.
మహేష్ బాబు చిత్రానికి ఖలేజా పెడుతున్నట్లు వార్తలు వచ్చాయని, ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారని, కనుక ఖలేజా టైటిల్ మహేశ్ బాబుకు ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఫిలిమ్ ఛాంబర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, తగు విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని చెప్పారని విజయభాస్కర్ రెడ్డి వివరించారు.
మహేష్ బాబు అనుష్క ఖలేజా టాలీవుడ్ విజయభాస్కర్ రెడ్డి maheshbabu anushka khaleja vijay bhaskar reddy tollywood


Click it and Unblock the Notifications