"హలో" హక్కులు ఎన్నో చిక్కులు
సినిమా కాపీరైట్ హక్కుల విషయంలో ము గ్గురు సినీ ప్రముఖులు ఒక నిర్మాతను మోసం చేసినట్టు పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మలయాళ సినిమా 'హలో' హక్కులను నిర్మాత ప్రదీప్‌చౌదరి 2007, ఆగస్టు 14న సినీ వ్యాపారి పాండురంగారావు వద్ద రూ. 45లక్షలకు కొనుగో లు చేశారు. ఇద్దరు నిర్మాతలు బెల్లంకొండ సురేష్, మాగంటి గోపీనాథ్, మరో ప్రముఖుడు ఎం.వెంకట్ సమక్షంలో ఈ మొత్తాన్ని పాండురంగారావుకు అందజేశారు.
మలయాళ నిర్మాత మణి నుంచి రూ. 30 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకొని, ఇక్కడ 45 లక్షలకు నకిలీ అగ్రిమెంట్ తయారుచేసి తనను పాండురంగారావు మోసం చేసినట్లు ప్రదీప్ ఫి ర్యాదు చేశారు. ఈ విషయం సురేష్, వెంకట్, గోపీనాథ్‌కు తెలిసినా తనతో చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రదీప్ పోలీసులను ఆశ్రయించారు


Click it and Unblock the Notifications