సినిమా పేరు విష్ణువర్దన్, దానిపై ధనాధన్
విష్ణువర్దన్ పేరుతో సినిమా తీసే విషయంలో దుమారం చెలరేగింది. విష్ణువర్దన్ భార్య భారతి, విష్ణు స్నేహితుడు నటుడు, నిర్మాత, దర్శకుడు ద్వారకేష్‌ల మధ్య వివాదం సాగుతోంది. విష్ణువర్దన్ తో ద్వారకేష్ నిర్మించిన ఆప్తమిత్ర సంచలన విజయం సాధించింది. తరువాత అదే కథ ఆధారంగా రజనీకాంత్‌తో చంద్రముఖి సినిమా తీశారు. తరువాత ద్వారకేష్ బ్యానర్‌లో విష్ణువర్దన్ నటించలేదు. ప్రస్తుతం ద్వారకేష్ విష్ణువర్దన్ అనే పేరుతో సినిమాను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో సుదీప్ కథానాయకుడు. తన భర్త పేరుతో సినిమా తీయడానికి ఒప్పుకోనని భారతి విష్ణువర్దన్ బుధవారం అన్నారు. ఈ మేరకు కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేశారు. విష్ణువర్దన్ పేరుతో సినిమా తీయడానికి ఆయన వారసుడు అనిరుధ్ (అల్లుడు), తన మనుమడు వున్నాడని, వారే విష్ణు పేరుతో సినిమా తీస్తారని భారతి అన్నారు.
సినిమా తీస్తా: తాను విష్ణువర్దన్ పేరుతో సినిమా తీస్తానని ద్వారకేష్ బుధవారం స్పష్టంచేశారు. విష్ణువర్దన్ ఐదు కోట్ల కన్నడిగుల సోత్తు అని అన్నారు. విష్ణువర్దన్ పేరు అందరికి సొంతం అని అన్నారు. ఎవరు అడ్డుకున్నా ఇదే పేరుతో సినిమా తీస్తామని, పేరు మార్చే ప్రసక్తే లేదని ద్వారకేష్ కుండలు బద్దలుకొట్టినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న విష్ణు అభిమానులు బుధవారం వందల మంది ఆయనఇంటి ముందు గుమికూడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


Click it and Unblock the Notifications











