Disrespect of AR Rahman ట్రెండింగ్.. ఏఆర్ రెహ్మాన్‌తో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. నెటిజన్ల ట్రోలింగ్
సంగీత మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్‌కు పూణేలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల పూణేలోని రాజ్ బహద్దూర్ మిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదికపై లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ సంగీత విభావరిలో ఏఆర్ రెహ్మాన్‌తోపాటు ఆయన బృందంలోని సభ్యులు భారీగా పాల్గొన్నారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కాన్సర్ట్ దాదాపు రెండు గంటలపాటు అంటే 8 గంటల నుంచి 10 గంటల వరకు నిరాటంకంగా సాగింది. అయితే అనుమతించిన పరిమితి దాటిందనే కారణంతో అర్ధాంతరంగా రెహ్మాన్ కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఛయ్య.. ఛయ్యా పాటను మధ్యలోనే :మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజికల్ నైట్ ఉత్సాహంగా, జోష్‌తో సాగింది. సుమారు 10.14 గంటల ప్రాంతంలో పోలీసులు వేదికపైకి వచ్చి.. షోను నిలిపివేయాలని కోరారు. దాంతో పోలీసుల సూచనలతో ప్రేక్షకులకు క్షమాపణ చెబుతూ.. చివరగా పాడుతున్న ఛయ్య.. ఛయ్యా పాటను అర్ధాంతరంగా నిలిపివేశారు. అయితే అభిమానులు మాత్రం వేదిక వద్ద అసహనానికి గురయ్యారు.

సుప్రీం కోర్టు నిబంధన కారణంగా :రెహ్మాన్ షోను అర్ధాంతరంగా ఆపివేయడంపై పూణే పోలీసులు వివరణ ఇచ్చారు. పూణే డీసీపీ స్మర్తన పాటిల్ మాట్లాడుతూ.. రెహ్మాన్ చివరి పాటను పాడుతున్నాడు. అతడు 10 గంటలు దాటిందనే విషయాన్ని మరిచిపోయాడు. దాంతో వేదిక వద్ద ఉన్న పోలీసులు ఆయన వద్దకు వెళ్లి 10 గంటల తర్వాత కార్యక్రమాలను నిర్వహించవద్దనే సుప్రీంకోర్టు నిబంధనను తెలియజేశారు. దాంతో ఆయన తన పాటను నిలిపివేశారు అని తెలిపారు.

మరోసారి పూణేకు వచ్చి.. :పూణే లైవ్ మ్యూజిక్ షో తర్వాత సోమవారం ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేశారు. పుణే వాసులారా.. మీ ప్రేమను పంచినందుకు, మీ ఉత్సాహాన్ని ఎనలేని విధంగా చాటినందుకు చాలా థ్యాంక్స్. షో మొత్తం రోలర్ కోస్టర్ రైడ్‌గా మారింది. క్లాసికల్ మ్యూజిక్ పూణే హోమ్ అని మరోసారి చాటింది. మరోసారి పూణే వచ్చి మీ అందరితో గళం కలుపుతాను అని ఏఆర్ రెహ్మాన్ తన ట్వీట్‌లో తెలిపారు.

పూణే కానీ.. పాలకొల్లు కానీ.. :అయితే ఏఆర్ రెహ్మాన్ షోను నిలిపివేయడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అది పూణే నగరం కావొచ్చు.. పాలకొల్లు పట్టణం కావొచ్చు. కళాకారులు ఎక్కడైనా సాఫ్ట్ టార్గెట్ అవుతారు. క్రైమ్‌ను ఆపడం కన్నా... మ్యూజికల్ నైట్స్‌ను ఆపడం చాలా సులభం. సంఘ సంస్కర్తలు వచ్చి చట్టం ముందు అందరూ సమానులే అని నీతులు చెబుతుంటారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
పోలీసుల ప్రవర్తనకు ఓ హద్దు ఉంటుందంటూ:ఏఆర్ రెహ్మాన్ సమయానికి మించి షో నిర్వహించడం తప్పే. కానీ పోలీసుల హద్దుకు ఓ పరిమితి ఉంటుంది. షోను ఆపే విధానం అది కాదు. పోలీసులు బాడీ లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంది. ఏఆర్ రెహ్మాన్ లాంటి కళాకారుడి షోలో పోలీసుుల అలా బిహేవ్ చేయడం సరికాదు. ప్రజలను మర్యాదతో ట్రీట్ చేయాలి అని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదంలో ఏఆర్ రెహ్మాన్ హిందీ భాష:ఇదిలా ఉండగా, ఏఆర్ రెహ్మాన్ ఇటీవల తన భార్య సైరా బానుతో కలిసి ఓ అవార్డు ఫంక్షన్‌కు వెళ్లారు. ఆ అవార్డు ఫంక్షన్‌లో సైరాబానును హోస్ట్ తమిళంలో అడిగిన ప్రశ్నకు ఆమె హిందీలో సమాధానం ఇచ్చారు.అప్పుడు ఏఆర్ రెహ్మాన్ ఆమెకు సలహా ఇస్తూ.. హిందీ కాదు.. తమిళంలో సమాధానం ఇవ్వాలని సూచించాడు.దాంతో నేను తమిళంలో అనర్గళంగా మాట్లాడలేను అంటూ ఇంగ్లీష్‌లో తన సమాధానాన్ని ముగించింది. ఈ ఘటన కొద్ది రోజలు క్రితం వివాదాస్పదంగా మారింది.


Click it and Unblock the Notifications











