జెండాకు అవమానమంటూ... షారుఖ్‌పై కేసు

By Bojja Kumar

Shahrukh Khan
ముంబై: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మరోసారి కోర్టు చిక్కుల్లో పడ్డాడు. షారుఖ్ జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త రవీంద్ర బ్రహ్మా అతనిపై ఫిర్యాదు చేసారు. ఏప్రిల్ 2, 2011న భారత క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్‌లో షారుఖ్ జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అవమానించారని ఆయన అంటున్నారు.

ఈ విషయమై రవీంద్ర మాట్లాడుతూ....షారుఖ్ జెండా నియమాలు మరిచి కాషాయం రంగు కిందకి, ఆకుపచ్చ రంగు పైకి ఉంచి జెండా ఊపారని, ఇది జెండాను అవమానించడమే అని రవీంద్ర తెలిపారు. ఇలాంటి ఘటనలు చూస్తూ ఊరుకుంటే జెండా ఎగురవేసే నిబంధనలు అంతా మరిచి పోతారని, అందుకే షారుఖ్‌పై కేసు వేయాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిపారు.

రవీంద్ర బహ్మా ఇటీవల గెహ్నా వశిష్ట అనే మోడల్‌పై ఫిర్యాదు చేసి అరెస్టు చేయించారు. జెండాను బికినీకి చుట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వశిస్ట్ త్రివర్ణ పతాకాన్ని అవమానించింది. జాతీయ జెండాను ఎవరు అవమానించినా ఊరుకునేది లేదని, వారిని కోర్టుకు ఈడ్చుడే అని రవీంద్ర తేల్చి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X