twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎగ్జిబిటర్లు అల్లాడి పోతున్నారు, సప్తగిరి వల్ల మంచి లాభాలొచ్చాయి: బ్రహ్మయ్య

    |

    సప్త‌గిరి, వైభ‌వి జోషి జంట‌గా న‌టించిన సినిమా వ‌జ్ర‌ క‌వ‌చ‌ధ‌ర‌ గోవింద‌. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కుడు. శివ శివ‌మ్ ఫిలిమ్స్ బేనర్లో న‌రేంద్ర య‌డ‌ల‌, జీవీయ‌న్ రెడ్డి నిర్మించగా డిస్ట్రిబ్యూటర్ బ్ర‌హ్మ‌య్య ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి జూన్ 14న విడుదల చేశారు. ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.

    తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ... మేము పెద్ద హీరో సినిమా చేయలేం. అందుకే చిన్న హీరో సినిమా కొన్నాను. ఇప్పటి వరకు 114 సినిమాలను సీడెట్లో రిలీజ్ చేశా. ఒక సినిమా మార్కెట్ ఎంత అని అంచనా వేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తిని. నేను అడిగిన రేటుకు నిర్మాతలు సినిమాను ఇచ్చారని తెలిపారు.

    Distributor Brahmaiah Speech at Vajra Kavachadhara Govinda Success Meet

    ఆంధ్రప్రదేశ్‌ మొత్తం ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం. నన్ను నమ్మి సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలు లేక హాలు రిపేరులో ఉన్నది అని పెట్టిన బోర్డులు దర్శనమిచ్చాయి. ఇలాంటి పరిస్థితి నేను నా 33 ఏళ్లలో చూడలేదు. సినిమాలు లేక ఎగ్జిబిటర్లు అల్లాడి పోతున్నారు. ఆ సమయంలో వజ్ర కవచధర గోవిందా 400 థియేటర్లలో సినిమా రిలీజ్ అయి అందరికీ ఊరటనిచ్చిందని బ్రహ్మయ్య తెలిపారు.

    ప్రేక్షకుల ఆదరణతో మేము అనుకున్నదానికంటే బావుంది, డబల్ కలెక్షన్ వస్తోంది. అదే రోజు నాలుగు సినిమాలు రిలీజైనా మా సినిమాకు ఆదరణ బావుంది. మేము రూ. 25 కోట్లు, రూ. 30 కోట్ల సినిమా చేయలేదు. చిన్న సినిమా చిన్న హీరోతో చేశాం. మంచి లాభాలు గడిస్తున్నాం. బి, సి సెంటర్లలో మంచి ఆదరణ లభిస్తోంది. 500 రూపాయలు కూలీ చేసి సంపాదించే వారు రూ. 50 ఖర్చు పెట్టి మా సినిమా చూస్తున్నారు. ఎ క్లాస్ సెంటర్ వారు కూడా సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు బ్రహ్మయ్య వ్యాఖ్యానించారు.

    English summary
    Distributor Brahmaiah Speech at Vajra Kavachadhara Govinda Success Meet. The movie starring Saptagiri, Vaibhavi Joshi, Archana Shastry, Temper Vamsi, Jabardasth Fame Avinash, and Appa Rao, direted by Arun Pawar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X