చస్తే చావనీ...! బయ్యర్లకు రూపాయి కూడా ఇవ్వను : తేల్చేసాడు

కాబిల్ సినిమా సూపర్‌హిట్‌ అయి బయ్యర్లు అందరూ హ్యాపీగా వున్నారని రాకేష్ రోషన్ మరోసారి గట్టిగా చెప్పాడు.

మొన్నామధ్య బాలీవుడ్ ప్రొడ్యూసర్ హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ షారూక్ మీద బాగానే ఫైర్ అయ్యాడు. తన సినిమా "కాబిల్" కు రావాల్సిన కలెక్షన్లన్నీ ఎత్తుకు పోతున్నాడో అని గగ్గోలు పెట్తాడు. ఒకేరోజు ఇద్దరు బడా స్టార్స్ మూవీస్ రిలీజ్ చేయకూడదని అంగ్రీమెంట్ ఉంది. కానీ షారుఖ్ ఖాన్ ఆ ఒప్పందాన్ని క్రాస్ చేసి షారూక్ తన రాయీస్ మూవీని కాబిల్ తో పోటీకి నిలిపాడని రాకేష్ రోషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

షారుఖ్ ఖాన్ దారుణంగా మోసం చేశాడంటూ విమర్శలు గుప్పించాడు. కాబిల్ కి పోటీకి దిగడమే కాక షారుఖ్ ఖాన్ అగ్రిమెంట్ ని కూడా క్రాస్ చేశాడని రాకేష్ రోషన్ ఫైర్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా రాయీస్, కాబిల్ సినిమాలకు 50-50 థియేటర్స్ పంచుకునేలా అంగీకారం కుదిరిందట. అంతేకాదు ఎగ్జిబిటర్స్ కోరిక మేరకు రిలీజ్ కి ముందే కాబిల్ ప్రివ్యూ కూడా వేశాడట.

Distributors Ask Kaabil Producer Rakesh Roshan to Pay for Losses

కానీ తీరా రిలీజ్ టైంకి మాత్రం షారుఖ్ అంగ్రీమెంట్ ని అతిక్రమించి తమ సినిమాకు థియేటర్స్ దక్కకుండా చేశాడని ఈ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫీలయ్యాడు. షారుక్ చేసిన మోసం వల్ల 150 కోట్ల నష్టం వచ్చిందని, షారుక్ ఇలా మోసం చేస్తాడని ఊహించలేదని తను చేసిన పనికి షాక్ అవ్వడంతో పాటు చాలా భాదపడ్డాననీ చెప్పాడు. అయితే వారం తిరక్కుండానే కాబిల్ సూపర్ హిట్ అన్నారు. ఎనబై కోట్ల లాభాలు వచ్చాయి అన్నాడు. అయితే ఇప్పుడు మరో గొడవ మొదలయ్యింది...

అంతకంటే కామెడీ ఇంకోటుంది ఈ చిత్రాన్ని భారీ రేట్లకి విక్రయించిన నిర్మాత రాకేష్‌ రోషన్‌ అన్ని హక్కులు కలిపి ఎనభైకోట్ల లాభాలు వెనకేసుకున్నాడన్నది పక్కన పెడితే అసలు "కాబిల్" కి వచ్చిన కలెక్షన్ల మీద అనుమానం కలిగేలా ఉంది.. ఇంతకీ ఏమయ్యిందంటే.... ఈ చిత్రాన్ని ఇండియాలో పంపిణీ చేసిన పలువురు బయ్యర్లు బాగా నష్టపోయారట. వారు రాకేష్‌ని సంప్రదించి తమ గోడు వినిపించారని, పదిహేను కోట్ల నష్ట పరిహారం ఇవ్వమని అడిగారని, దానికి రాకేష్‌ సానుకూలంగా స్పందించాడని వార్తలొచ్చాయి. అయితే రాకేష్‌ రోషన్‌ వాళ్ళ చావు వాళ్ళు చస్తారు తాను మాత్రం రూపాయి ఎవరికీ వెనక్కి ఇచ్చేది లేదని అంటున్నాడు.

అసలు నష్టం వచ్చిందంటూ తనని ఎవరూ సంప్రదించలేదని, కాబిల్‌ విజయాన్ని ఓర్వలేక కొందరు కావాలనే తనమీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి బయ్యర్లు అందరూ హ్యాపీగా వున్నారని ఆయన మరోసారి గట్టిగా చెప్పాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌ అంతంత మాత్రమేనని, ఎనభై అయిదు కోట్లకి కొంటే కనీసం యాభై కోట్లు కూడా తిరిగి రాలేదని ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి. తన సినిమా వసూళ్లని ఎక్కువ చేసి చెప్పుకునే అలవాటున్న రాకేష్‌ రోషన్‌ ఇప్పటికీ అదే ఫేక్‌ లెక్కలు చెబుతూ సినిమా హిట్టని చెప్పడం హాస్యాస్పదం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X