దేవర డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు.. దుబాయ్‌లో పార్టీలా? నెటిజన్లు ఫైర్

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏ స్టార్ హీరో సినిమా అయినా రిలీజ్ అయితే.. పబ్లిక్ టాక్ తో సంబంధం లేకుండా.. ఆ హీరో అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి, కలెక్షన్లను పడిపోకుండా జాగ్రత్త పడటానికి భారీ వసూలు సాధించినట్లు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే మార్కెట్లో భారీ హైప్స్ క్రియేట్ చేసకున్న సినిమాలు.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ ఓపెనింగ్స్ అందుకుంటే.. ఇటు ప్రేక్షకులు గాని, అటు ఇండస్ట్రీ గాని ఎవరూ పట్టించుకోదు. కానీ ఎలాంటి హైప్స్ లేని సినిమాలు, మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీస్కు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటూ ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కూడా ఫేక్ కలెక్షన్ పోస్టర్స్‌ రిలీజ్ చేశారా? నష్టాలు వచ్చినా దుబాయిలో పార్టీలు చేసుకున్నారా? అనేది చర్చ మొదలైంది.

ఈ విషయం ఇప్పుడెందుకు తెరపైకి వచ్చిందని భావిస్తున్నారా? విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు తొలి ఆట రోజునే పాజిటివ్ టాక్ అందుకుంది. థియేటర్లల్లో సక్సెస్ పుల్ గా నడుస్తూ.. ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు కూడా భారీ లాభాలను తెచ్చి పెట్టింది. సంక్రాంతికి వస్తున్నాం హిట్ నేపథ్యంలో దిల్ రాజ్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. సినిమా హిట్ అయితే నిర్మాత, హీరోలు పార్టీలు చేసుకునే వారే కాకుండా.. భిన్నంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సక్సెస్ మీట్ పెట్టారు. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌కు పార్టీ ఇచ్చారు.

Distributors LVR speech goes viral NTR Devara Collection Posters also trolled

ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లంతా కూడా మీడియా ముందుకు వచ్చి.. అసలు లెక్కల్ని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ బయటపెట్టరు. వారికి నష్టాలు వచ్చినా బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉందంటూ వాపోయారు. వందల, వేల కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయని ప్రకటించినా.. కానీ డిస్ట్రిబ్యూటర్ ఖాతాల్లో మాత్రం నష్టాలే మిగులుతాయన్నారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమా బ్రేక్ ఈవెన్ అయితేనే హిట్ అని చెప్పుకుంటున్న పరిస్ధితులు ఇండస్ట్రీలో ఉన్నాయని, అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సమయంలో రిపోర్టర్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి. ఎన్నో వందల కోట్లు వచ్చాయని పోస్టర్లు వేశారు. సక్సెస్ పార్టీ అంటూ దుబాయ్ లాంటి విదేశాలకు తీసుకెళ్లారు. అందులో రియాల్టీ మాత్రం వేరేలా ఉందా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన దేవర , అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలకు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ఎల్‌వీఆర్ (LVR) ఇచ్చిన సమాధానం అందరినీ షాక్ కు గురి చేసింది. 'మా డిస్ట్రిబ్యూటర్ల దైర్భాగ్యం అలానే ఉంటుంది.. మేం ఏదీ బయటకు మాట్లాడలేం.. మాట్లాడకూడదు.. మాట్లాడితే విరోధం.. డబ్బు పోగొట్టుకుని కూడా.. పోగొట్టుకోలేదని చెప్పాల్సిన పరిస్థితి మాది' అంటూ ఫీల్ అయ్యారు.

Distributors LVR speech goes viral NTR Devara Collection Posters also trolled

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ' ఇలా మీడియా ముందుకు వచ్చి నష్టపోయామని చెబితే.. నెక్ట్స్ సినిమా ఇవ్వరని భయం. ఇప్పుడు సినిమా కలెక్షన్ల గురించి మేం చెప్పడం కాదు.. మూవీ మేకర్స్ వేసే పోస్టర్లను చూసి.. జనాలు నమ్మడం లేదు. ఆ పోస్టర్లను చూసి జనాలే నవ్వుకుంటున్నారు ' అంటూ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ షాకింగ్ సమాధానమిచ్చారు. ఆ ఆన్సర్లను విశ్లేషిస్తూ గత కొన్నేళ్లుగా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతూనే ఉన్నారని అర్థం అవుతోంది.

ఈ తరుణంలో కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ 'దేవర' కలెక్షన్ కూడా ఫేక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమా రూ. 500 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు అఫీషియల్ గా మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్ని ఫేక్ కలెక్షన్స్ అని అభిప్రాయపడుతున్నారు. దేవర భారీ సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్ నాగవంశీ దుబాయ్ లో పార్టీ ఇవ్వడం కూడా డ్రామానే అంటు కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప, పుష్ప 2 సినిమాల విషయంలో కూడా ఇదే జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల కలెక్షన్స్ పై కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక గేమ్ ఛేంజర్ కలెక్షన్ పోస్టర్లపై ఇలాంటి కామెంట్సే వస్తున్నాయి. మొత్తానికి
ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Read more about: devara ntr koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X