twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీని కలుస్తున్నాం...భధ్రత కావాలి

    By Srikanya
    |

    చెన్నై: మేం రజనీకాంత్ ని కలవబోతున్నాం..మాకు రక్షణ కల్పించండి అంటూ లింగా పంపిణీదారులు అందించిన వినతి పత్రం ఇప్పుడు తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మేం లింగా ని డిస్ట్రిబ్యూట్ చేసాం. నష్టబోయాం. ఆ నష్టపరిహారం కోరుతూ హీరో రజనీని కలుస్తున్నాం..మాకు భధ్రత కావాలి అంటూ చెన్నై పోలీస్ కమిషనర్ ని కలిసి ధియోటర్ల యాజమాన్య, డిస్ట్రిబ్యూటర్లు అశోశియేషన్ కోరింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆ వినతి పత్రంలో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా ఈ మధ్య కాలంలో ఆశించిన స్ధాయి లో వసూళ్లు సాధించలేదన్నారు.ముఖ్యంగా తిరునెల్వేలి, కన్యాకుమారి ఏరియాలనకు నాలుగు కోట్ల ఇరవై లక్షలకూ లింగా చిత్రాన్ని కొనుగోలు చేస్తే ..ఇప్పటివరకూ కేవలం కోటిన్నర మాత్రమే వసూలు చేసిందన్నారు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి ఉందన్నారు. దీంతో తాము చాలా నష్టం చూడాల్సి వస్తోందని అన్నారు. ఇందునిమిత్తం ఈ రోజు అంటే సోమవారం స్దానిక కోడం బాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీని కలవనున్నట్లు తెలిపారు.

    Distributors Meeting Rajinikanth With Police Protection

    మరో ప్రక్క తమ తాజా చిత్రం లింగాపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ చిత్రాన్ని విడుదల చేసిన వేందర్ మూవీస్ సంస్థ హెచ్చరించింది. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన లింగాపై ఫలితం విషయంలో రకరకాల ప్రచారం సాగుతోంది.

    అలాగే చిత్రం ఆశించిన విధంగా లేదని, రజనీకాంత్, కేఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన ముత్తు, పడయప్పాలను పోల్చుకుంటే లింగా ప్రజాద రణ పొందలేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆశించిన వసూళ్లు సాధించకపోవడంతో థియేటర్ల యజమాన్యాలు రజనీకాంత్ ను కలిసి నష్ట పరిహారం కోరడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నారు. దీంతో వేందర్ మూవీస్ సంస్థ స్పందించింది.

    వేందర్ మూవిస్ వారు మాట్లాడుతూ... లింగా చిత్రం గురించి తప్పుడు ప్రసారం జరుగుతోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతుండడం, లింగా చిత్రాన్ని 600 థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం లాంటి కారణాల వలన వసూళ్లు తక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది.

    ఈ శుక్రవారం నుంచి లింగా చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారని తెలిపింది. వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొంది. లింగా చిత్రం గురించి అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లింగా చిత్రాన్ని విమర్శకుల కోసం తీయలేదని చురకలు వేస్తూ అసత్య ప్రచారాలను కేఎస్.రవికుమార్ ఖండించారు.

    సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లు. ఈ చిత్రానికి కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను ఇరాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ నుంచి తమిళనాడు, కేరళ విడుదల హక్కులను వేందర్ మూవీస్ సంస్థ పొందింది.

    చిత్రం కథేమిటంటే...

    లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు.

    అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు.

    ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా చేసారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

    English summary
    Super Star Rajinikanth's Lingaa distributors sought police protection. They met Police Commissioner at Chennai in his office and submitted a letter informing him that they are meeting Super Star Rajinikanth to request him to help him bail them out of Lingaa losses. They even requested protection from police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X