బిగ్ పీపుల్ క్లెవర్ గేమ్స్, సమస్య పక్కదారి: శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

By Bojja Kumar

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా జరుగుతున్న పోరాటం చివరకు అనేక మలుపులు తిరిగి పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో టాలీవుడ్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆందోళన, ఇండస్ట్రీలోని ప్రముఖులు ఇదేంటి అంటూ శ్రీరెడ్డి చర్యలను నిలదీయడం లాంటి ఘటనలతో వాతావరణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి వెనక నేనే ఉన్నానంటూ ప్రకటించుకుని రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం క్రియేట్ చేశారు.

Recommended Video

Sri Reddy Reacts About Phone Call Leak

ఏది ఏమైనా మొత్తానికి కాస్టింగ్ కౌచ్ అంశాన్ని ఇండస్ట్రీ పెద్దలు సీరియస్‌గా తీసుకుని సమావేశాలు నిర్వహించి క్యాష్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే శ్రీరెడ్డి మాత్రం తన పోరాటం కొనసాగిస్తాను అంటోంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశంతో పాటు తెలుగు వారికి 70 శాతం అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో ఆమె తన పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకుంది.

బిగ్ పీపుల్ క్లెవర్ గేమ్స్

ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు క్లెవర్ గేమ్స్ ఆడుతున్నారు, అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.....అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో ఓ ట్వీట్ చేశారు.

నా గ్రూఫులో ఉండాలంటే ఇక ఆపండి

తన ఫోన్ కాల్ రికార్డును లీక్ చేసి, మీడియా ముందుకు వెళ్లి నేపథ్యంలో ట్రాన్స్ జెండర్ నటి తమన్నా గురించి శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు. ఆమె నాకు గత వారం రోజులుగా మాత్రమే తెలుసు. మేము కలిసింది 2 సార్లు మాత్రమే. నా సొంత సోదరిలా చూసుకున్నాను. మీడియా ముందుకు వెళ్లిన అనవసరంగా ఏదేదో మాట్లాడవద్దు. మేము న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నాం. ఎవరైతే నా గ్రూఫులో ఉండాలనుకుంటారో వారు నా మీద కామెంట్స్ చేయడం ఆపండి.... అని శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు.

నా పేజీనీ పోలీసులు గమనిస్తున్నారు

నా ఫేస్ బుక్ పేజీని పోలీసులు గమనిస్తున్నారు. ఏదైనా కామెంట్స్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ఎలా బెదిరింపులకు పాల్పడుతున్నారో, పీకే ఫ్యాన్స్ ఎలా ట్రోల్ చేస్తున్నారో వారి వివరాలు హెచ్ఆర్సీకి కూడా చూపిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని పరిశీలిస్తోంది అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

 శ్రీరెడ్డి చెబుతున్న ఆ పెద్దలు ఎవరు?

శ్రీరెడ్డి చెబుతున్న ఆ పెద్దలు ఎవరు?

ఇండస్ట్రీ పెద్దలు క్లెవర్ గేమ్స్ ఆడుతున్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు అని శ్రీరెడ్డి చెబుతోంది. మరి ఆ పెద్దలు ఎవరు? అనేది చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X