twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కలవరమాయే మదిలో' ఏమైంది?

    By Staff
    |

    కలర్స్ స్వాతి ప్రధానపాత్రలో రూపొందిన 'కలవరమాయే మదిలో...'చిత్రం భాక్సాఫీస్ ని మెప్పించలేకపోతోందని సమాచారం. కె.విశ్వనాధ్ చిత్రాల ప్రేరణతో తీసినట్లున్న ఈ సినిమా సెకెండాఫ్ స్లోగా నడవటం మైనస్ అయిందని చెప్తున్నారు. అందులోనూ స్వాతికి జోడిగా వేసిన కమల్ కామరాజు(ఆవకాయ బిర్యాని ఫేమ్)కూడా నప్పలేదని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో స్వాతి ఎప్పటికైనా ఏ.ఆర్.రహమాన్ సంగీత దర్శకత్వంలో పాట పాడాలనే కోరిక ఉన్న ఏస్పెరెంట్ సింగర్ గా కనిపిస్తుంది.అయితే ఆమె తల్లికి అది ఇష్టం లేకపోవటంతో కుటుంబ భాధ్యతలు కోసం జాబ్ చేస్తూ..ఖాళీ సమయాల్లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పాడుతూంటుంది. అక్కడ కలిసిన కమల్ కామరాజు ఆమెను నువ్వు పాడేది పాట కాదని విమర్శించి, ఆమెను మంచి సింగర్ అవ్వటానికి ప్రేరేపిస్తూంటాడు.

    ఆ క్రమంలో పరిచయమైన మరో సంగీత జ్ఞాని రావు (విక్రమ్ గోఖలే)ఆమెను బేసిక్స్ కూడా తెలియకుండా పాడుతోందని తిడతాడు. దాంతో రావుని మెదట ఆమె ద్వేషించినా ఆ తర్వాత ఆయన సంగీత జ్ఞానానికి దాసోహమని, శిష్యరికం చేస్తుంది. అయితే అప్పుడో ఊహించని నిజం బయిటపడి ఆ గురు, శిష్యురాలి సంభందాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇక సెకెండాఫ్ లో వచ్చే ఈ ట్విస్టు నిజానికి ఆమె గోల్ కి సంభందించి కాదు. అప్పటివరకూ పాటలుతో, స్వాతి ఉషారైన డైలాగులుతో ఫస్టాఫ్ నడిచినా సెకెండాఫ్ లో ఆ ఊపు, ఉషారు కనపడదు. అయితే ఈ సినిమా ఏ మాత్రం జనాలకి పట్టాలన్నా అది స్వాతి నటనతోనే సాధ్యం. ఇక దర్శకుడు నీట్ గా క్లీన్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించటం తో ఓ వర్గానికే పరిమితం అయ్యి మల్టి ప్లెక్స్ లకే వర్కవుట్ అయ్యే వాతావరణం కనపడుతోంది. అలాగే అష్టాచెమ్మా అనంతరం కలర్స్ స్వాతి నటించిన స్ట్రైయిట్ చిత్రం కావటంతో ఓపినింగ్స్ బాగానే ఉన్నాయి. అయితే అవి ఎంతకాలం నిలబడతాయన్నిది చూడాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X