»   » ‘దివ్యమణి’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

‘దివ్యమణి’ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్, గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "దివ్య మణి". ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం సెన్సార్‌కు సిద్ధమైంది.

సురేష్ కమల్ మాట్లాడుతూ.... నటుడుగా ఇది నా తొలి చిత్రం. గిరిధర్ కథే ఈ చిత్రానికి హైలెట్. యాక్షన్ అంతా నేను ఓరిజినల్‌గా చేశాను. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంటుందని వెల్లడించారు.

Divya Mani to release on 15th June

గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ.. దివ్యమణి సొషియో ఫాంటసీ చిత్రం.‌ బ్యాంకాక్, పట్టాయా, నొమెన్స్ ఐలాండ్, హైదరాబాద్, బెంగళూరు లొకెషన్స్ లో తెరకెక్కించాము. ఈ సినిమాకు మాస్టర్ కమల్ స్టంట్స్ హైలెట్‌గా నిలుస్తాయి. రకరకాల ఫైటింగ్ స్టయిల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. సినిమా ఔట్‌పుట్ ఎక్స్‌ట్రార్డినరి‌గా వచ్చింది. అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. జూన్ 15న సినిమాను విడుదల చేస్తామన్నారు.

Divya Mani to release on 15th June

ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్ లాండ్), రామ్ లక్ష్మణ్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్

English summary
Tollywood Upcoming movie Divya Mani, Starring Suresh Kamal, Vyshali and Kimaya, to release on 15th June. The movie Directed by Giridhara Gopal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X