twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడ్డదారులు తొక్కలేదు, అందుకే పెద్ద హీరోలతో.. డైరెక్టర్స్‌తో ఆ పని చేసి హీరోయిన్ కావడం గొప్పా!

    |

    ఇటీవల తెలుగుదేశం పార్టీలో పెళ్లి పుస్తకం ఫేమ్ దివ్యవాణి జాయిన్ అయ్యారు. ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూ తరచుగా దివ్యవాణి వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల దివ్యవాణి తన సినీ జీవితం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు కాంప్రమైజ్ కావడం అనే విషయం గురించి దివ్యవాణి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు తక్కువ చిత్రాలకే పరిమితం కావాల్సి వచ్చిందో వివరించారు.

     చిన్న వయసులోనే

    చిన్న వయసులోనే

    దివ్యవాణి మాట్లాడుతూ నా సినీ రంగ ప్రవేశం చాలా చిన్న వయసులో జరిగింది. పెళ్లి పుస్తకం చిత్రంలో నటించే సమయానికి నాకు 16 ఏళ్ళు. వివాహం కూడా త్వరగా జరిగింది. 22 ఏళ్లకే పిల్లలు పుట్టారు. నీతో కలసి బయటకు వస్తే తెలియని వాళ్ళు ఆవిడ మీ అక్కా అని అడుగుతున్నారంటూ నా కొడుకు జోకులు వేస్తుంటాడు. చుడిదార్ వేసుకుని వెళితే నా పిల్లలకు తల్లి అని ఎవరూ అనుకోరు అంటూ దివ్యవాణి సరదాగా వ్యాఖ్యానించారు.

    అడ్డదారుల్లో

    అడ్డదారుల్లో

    అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాక ముందే నాకు నటనలో మంచి ప్రతిభ ఉండేది. నేను అడ్డదారుల్లో హీరోయిన్ ని కాలేదు. ఏ దర్శకుడి వద్ద, హీరో వద్ద కాంప్రమైజ్ కాలేదు. అందుకే పెద్ద హీరోలతో నటించలేకయా అని దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని భాషలో తాను 40 చిత్రాల వరకు చేశానని తెలిపారు.

    నా రేంజ్ ఏంటో చిరంజీవికి తెలుసు.. ఆయన భోజనం చేస్తుంటే కుర్చీ లాగేశారు!నా రేంజ్ ఏంటో చిరంజీవికి తెలుసు.. ఆయన భోజనం చేస్తుంటే కుర్చీ లాగేశారు!

     అలా హీరోయిన్ కావడం గొప్పా

    అలా హీరోయిన్ కావడం గొప్పా

    తాను సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నానో, సినిమాల్లోకి వచ్చాక కూడా అలాగే ఉన్నానని దివ్యవాణి అన్నారు. కొందరు హీరోయిన్లు వందల చిత్రాలు చేస్తుంటారు. దర్శకుల దగ్గర, హీరోల దగ్గర కాంప్రమైజ్ అయి హీరోయిన్ కావడం, అవకాశాలు సాధించడం ఏమైనా గొప్ప విషయమా అని ప్రశ్నించారు. వేరే హీరోయిన్లు కోటి చిత్రాలు చేసినా నా పెళ్లి పుస్తకం సినిమా ముందు సరిపోరని దివ్యవాణి వ్యాఖ్యానించారు.

    లక్ష్మీపార్వతిపై నిప్పులు

    లక్ష్మీపార్వతిపై నిప్పులు

    దివ్యవాణి మాట్లాడుతూ లక్ష్మీపార్వతిపై నిప్పులు చెరిగారు. చంద్రుడిలో మచ్చ ఎలా ఉందో అలా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు మచ్చగా మారారు. ఆమె నిజంగా ఎన్టీఆర్ ని ప్రేమించిన మనిషే అయితే బయటకు వెళ్లి సొంతంగా పార్టీ పెట్టదు.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో చేరదు అని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ ఎలాంటి సినిమాలు వచ్చినా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని తగ్గించలేవు అని అన్నారు.

    English summary
    Divyavani sensational comments on heroines who compromised with directors
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X