twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ అద్భుతమైన పాటలో ఒదిగిన దీపావళి

    By Bojja Kumar
    |

    తెలుగువారికి ఇష్టమైన పండగల్లో దీపావళి ఒకటి. అందుకే సినిమా దర్శకులు, రచయితలు కూడా ప్రేక్షకుల ఇష్టాన్ని సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడప్పుడు. 1991లో వచ్చిన మామగారు సినిమాలోని దీపావళి పాట దీపావళి పండగను మన కళ్లముందు ఉంచుతుంది. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి...ఇయ్యాలె అచ్చమైన దీపావళి అంటూ అద్భుతమైన పాట రాయగా, రాజ్-కోటి సుమధురమైన సంగీతం అందించారు. గాయకులు బాలు, స్వర్ణలత తమ గానంతో ప్రేక్షకులను మైమరిపించారు. దీపావళి పండగ వేళ ఆ పాటను మరోసారి గుర్తు చేసుకుందాం.

    పల్లవి :
    ఇయ్యాలె అచ్చమైన దీపావళి
    వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి

    ఏనాడు ఎళ్లిపోని దీపావళి
    ఏరి కోరి ఎంచుకొంది మా లోగిలి
    ఏల ఏల చుక్కల్లో
    యెలుగలన్ని యెదజల్లి
    మా ఇంట యెలిశాడు ఆ జాబిలి
    ఏల....

    చరణం : 1
    అలాంటిలాంటిటోడుగాదు
    మా అల్లుడుగారు
    కోటికొక్కడుంటాడా
    ఇలాంటి మంచివాడు
    కొండంత పెద్ద మనసు కలిగినోడు
    గోరంత పేదగూటికొచ్చినాడు
    కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే
    ఇట్టాంటి అల్లుడొస్తే ప్రతి అమాస
    ఆ ఇంటి దీపాళి పండగంట

    చరణం : 2
    మాయ మర్మం లేనివాడు
    మా మామగారు
    మట్టిలోని మాణిక్యం మా ఆడవారు
    గుండెల్లోన పెంచినాడు
    నన్ను కన్నవాడు
    గుండెను గుడి చేస్తాడు కట్టుకున్నవాడు
    మమకారమన్నది ఇంటి పేరు
    పెట్టి పుట్టనోళ్లు దీన్ని పొందలేరు
    సిరులేవీ కొనలేనిది సరిలేని ఈ పెన్నిధి
    ఇట్టాంటి నవ్వులుంటె ప్రతి అమవాస
    ఆ ఇంటి దీపావళి పండగంట

    English summary
    Diwali special song in Mamagaaru(1991). This song written by Sirivennela and sung by Balu, Swarna Latha. Music composed by Raj-Koti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X