twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YSRCP నేత, నిర్మాత పీవీపీపై డీకే అరుణ కుమార్తె కేసు.. మా తప్పు లేదంటూ పొట్లూరి వరప్రసాద్ ఖండన

    |

    ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ మరో వివాదంలో చిక్కుకొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రేమ్ పర్వత్ విల్లాలోకి అక్రమంగా వీపీవీకి సంబంధించిన కొందరు వ్యక్తులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు అంటూ ప్రముఖ రాజకీయవేత్త డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శృతి రెడ్డిపై పీవీపీ కూడా కేసు నమోదు చేయడం ఈ కేసులో ట్విస్టుగా మారింది. ఈ వివాద వివరాల్లోకి వెళితే..

    శృతిరెడ్డి ఫిర్యాదు ఏమింటంటే?

    శృతిరెడ్డి ఫిర్యాదు ఏమింటంటే?

    డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి ఫిర్యాదు ప్రకారం.. ఆదివారం రోజున కొందరు మా అనుమతి లేకుండా మా ఇంటి గోడను ధ్వంసం చేశారు. డ్రిల్లింగ్ మిషిన్లతో మా గోడపై ఐరన్ షీట్స్‌‌తో వాల్‌ను నిర్మించేందుకు ప్రయత్నించారు. తాను అడ్డుకొనేందుకు ప్రయత్నించగా తనపై దుర్బాషలాడారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పీవీపీపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సెక్షన్ 447, 427, 506, 509 కింద కేసు రిజిస్టర్ చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

    కిరాయి గుండాలతో అంటూ శృతిరెడ్డి

    కిరాయి గుండాలతో అంటూ శృతిరెడ్డి

    పీవీపీ, ఆయన సిబ్బందిపై ఫిర్యాదు చేసిన అనంతరం శృతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రేమ్ పర్వత్ గేటెడ్ కమ్యూనిటి. మా గోడపై గుండాలను ఎక్కించి పనులు చేయించుకొంటున్నారు. మా అనుమతి లేకుండా దౌర్జన్యం చేస్తున్నారు. కిరాయి రౌడీలను పంపించి మానసికంగా వేధిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కేసులు పెట్టినా పట్టించుకోకుండా బయట వ్యక్తులను పంపించి పీవీపీ బెదిరిస్తున్నారు. ముందు నుంచి అంటే.. రెండేళ్ల నుంచి ఇలానే చేస్తున్నారు అని శృతిరెడ్డి పేర్కొన్నారు.

    మా సెక్యూరిటిని బెదిరించారంటూ

    మా సెక్యూరిటిని బెదిరించారంటూ

    పీపీపీపై శృతిరెడ్డి ఆరోపణలు చేస్తూ.. మాతోనే కాకుండా ఇరుగుపొరుగు వారిని కూడా ఇలానే బెదిరిస్తున్నారు. పొరుగువారి ఇంటి రూఫ్ టాప్ గార్డెన్‌ను పదిమంది గుండాలతో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి కేసులు నడుస్తూనే ఉన్నాయి. మా ఇంటి వెనుక ఉన్న కాంపౌండ్ వాల్‌పైకి ఎక్కి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మా సెక్యూరిటీని బెదిరించారు. గ్రిల్ మిషన్ ఫైర్ మా ఇంటిలోకి వస్తున్నది. మా ఇంటిలోకి తొంగి తొంగి సిబ్బంది చూస్తుంటే భయంగా ఉంది అని శృతిరెడ్డి తెలిపారు.

    న్యాయం మా పక్షానే ఉందంటూ..

    న్యాయం మా పక్షానే ఉందంటూ..

    పీవీపీ వేధింపులతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. దాంతో మేము పోలీసులను ఆశ్రయించాం. న్యాయం మా పక్షాన ఉంది. మాకు చట్టాలంటే గౌరవం ఉంది. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం అని శృతిరెడ్డి తెలిపారు. అయితే శృతిరెడ్డి ఆరోపణలను పీవీపీ ఖండించారు. తాము చట్ట ప్రకారమే నడుచుకొంటున్నాం. ఇందులో మా తప్పేమీ లేదని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    పీపీపీ, శృతిరెడ్డి మధ్య అసలు వివాదం ఏమింటంటే

    పీపీపీ, శృతిరెడ్డి మధ్య అసలు వివాదం ఏమింటంటే

    అయితే పీవీపీ, శృతిరెడ్డి వివాదానికి అసలు కారణం ఏమిటంటే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో పర్వత్ విల్లాస్ పేరుతో పీవీపీ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. పర్వత్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటిలో డీకే అరుణ కూతురు శృతిరెడ్డి విల్లా కొనుగోలు చేశారు. ఇంటి మరమ్మత్తులో భాగంగా ప్రహారి గోడ నిర్మాణం చేపట్టారు.

    అయితే ఈ సమాచారం అందుకొన్న పీవీపీ అనుచరులు బాలాజీతోపాటు మరికొందరు అక్కడికి చేరుకొన్నారు. వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. పీవీపీ సిబ్బంది ప్రహారి గోడను జేసీబీతో కూల్చివేసినట్టు శృతిరెడ్డి ఆరోపించారు. అయితే నిబంధనలకు విరుద్దంగా వారు గోడను నిర్మిస్తున్నందునే తాము గోడను కూలగొట్టినట్టు పీవీపీ సిబ్బంది తెలిపారు.

    English summary
    BJP top Leader DK Aruna daughter Shruti Reddy files case on YSRCP leader, Producer PVP. She filed case at Banjara Hills police station. But PVP condemns Shruti Reddy allegations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X