twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందీప్ కిషన్-నిషా అగర్వాల్ ‘డికె బోస్’ రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్‌'. నిషా అగర్వాల్‌ హీరోయిన్. ఎన్‌.బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శేషురెడ్డి, ఆనంద్‌రంగా నిర్మాతలు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇప్పటికే మంచి రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రమ్‌లో కామెడీ పండించిన సప్తగిరి ఈచిత్రంలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్ర పోషిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ''అవినీతిపరుడైన యువ పోలీసు అధికారి కథ ఇది. పైసా ముట్టందే ఏ పనీ చేయని అతగాడు ప్రేమలో పడ్డాక ఎలా మారిపోయాడన్నది తెరపైనే చూడాలి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది'' అన్నారు.

    దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్‌ ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్‌ఆఫీసర్‌గా గోల్డ్‌మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు. ఈ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Sundeep Kishan and Nisha Agarawal starrer 'DK Bose' directed by AN Bose. The is slated for release on Sep 14. Anand Ranga and Seshu Reddy are jointly producing the film, under the banner of Random Thoughts banner, Sundeep Kishan will seen in the role of a police officer in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X