twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా తల్లి వేదనతో మంచాన పడ్డారు:మంచు విష్ణు వాంగ్మూలం

    By Srikanya
    |

    హైదరాబాద్ :"మా నాన్న జీవించి ఉండగానే గుంటూరులో కొందరు పిండ ప్రదానాలు చేశారు. దానిపై మా తల్లి తీవ్ర మనోవేదనకు గురై మంచాన పడ్డారు.సెన్సార్‌బోర్డు రివైజ్డ్ కమిటీ కూడా అనుమతి ఇచ్చాకే, దేనికైనా రెడీ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. ఆ సినిమాపై అభ్యంతరాలు చెబుతూ, కొందరు మా ఇంటిపై దాడి చేశారు. ఆ దాడి తాలూకూ దృశ్యాలను కోర్టుకు అందజేస్తాం'' అని మంచు విష్ణు వాంగ్మూలంలో పేర్కొన్నారు.

    సెన్సార్ అయిన సినిమానే తాము రిలీజ్ చేసినా, ఏవో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు తన తండ్రికి పిండ ప్రదానాలు చేసి, తమను మనోవేదనకు గురిచేశారని నటుడు మంచు విష్ణు నాంపల్లి కోర్టుకు చెప్పారు. 'దేనికైనారెడీ' చిత్ర వివాదంపై కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేసిన ఆయన.. కోర్టు ఆదేశాల మేరకు గురువారం నేరుగా హాజరై న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చారు. విష్ణు అక్కడికి వచ్చాక.. నాంపల్లి 3వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద న్యాయవాదులకు, జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం జరగ్గా న్యాయమూర్తి అందరినీ కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లమని ఆజ్ఞాపించారు.అనంతరం విష్ణు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

    కాగా... విష్ణు నాంపల్లి కోర్టుకు వచ్చారన్న సమాచారాన్ని టీవీల ద్వారా తెలుసుకున్న నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. ఆయన కోర్టు నుంచి వెలుపలికి రాగానే "విష్ణు డౌన్ డౌన్'' అంటూ నినాదాలు చేశారు. విష్ణు కారుపై చేతులతో బాదారు. అయినా ఆగకుండా విష్ణు కారులో వేగంగా వెళ్లిపోయారు. అంతకు ముందు కోర్టు గేటు వద్ద విష్ణు మీడియాతో మాట్లాడారు. 16 మందిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయమూర్తి ఈ కేసు విచారణను డిసెంబరు 7కు వాయిదా వేశారు.

    మరోవైపు మోహన్ బాబుతో పాటు సెన్సార్ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అటు మోహన్ బాబుకిచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాల డిమాండ్ చేశాయి. నాంపల్లి కోర్టులో విష్ణు కేసు పెట్టడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించాల్సింది పోయి కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. దేనికైనా రెడీ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

    English summary
    
 Manchu Vishnu filed a private complaint against 16 persons who allegedly performed last rites' rituals on his father Mohanbabu. When Vishnu approached Nampally Court to file the complaint, a large number of alleged Brahmin associations raised slogans against him and staged protest outside the court. Vishnu, after he filed the complaint, spoke to the media and confirmed that he filed complaint against 16 persons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X