ప్లీజ్ సార్.. పవన్ కళ్యాణ్‌తో ఖుషి-2 తీయండి, స్టేజ్‌పైనే అడిగిన స్టార్ హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన స్టైల్, మేనరిజమ్, నటనతో పవర్‌స్టార్‌గా ఎదిగారు. కెరీర్‌లో ఎన్నో సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ .. ఆల్‌టైమ్ బెస్ట్ అంటే అభిమానులు టక్కున చెప్పేది ఖుషీ గురించే . తమిళ దర్శకుడు ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ యువతను ఒక ఊపు ఊపింది. ఖుషి వచ్చి 20 ఏళ్లకు పైగానే గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా ప్రభావం అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా ఖుషిలో భూమిక నడుమును పవన్ చూసే సీన్ ఇప్పటికీ అభిమానులు గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ సీన్ ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ సీన్ కోసం మెంటల్‌గా ప్రిపేర్ కావడానికి టైం పట్టిందని .. ఆ తర్వాత మానిటర్‌లో ఈ సీన్ చూసుకుని బాగా వచ్చిందని ఆనందపడ్డానని భూమిక తెలిపారు. సినిమా రిలీజ్ అయ్యాక నడుము సీన్ అందరికీ బాగా నచ్చిందని.. ఖుషి విడుదలై అప్పుడే 20 ఏళ్లు దాటిపోయిందంటే ఆశ్చర్యంగా ఉందని భూమిక ఓ సందర్భంలో అన్నారు.

ఏఎం రత్నం నిర్మించిన ఖుషి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 101 సెంటర్లలో 50 రోజులు.. 79 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. అప్పట్లో హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో ఈ సినిమా కోటీ 56 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేదని పవన్ ఫ్యాన్స్ చెబుతుంటారు. 2022 డిసెంబర్ 31న ఖుషి 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ అయ్యింది. సెకండ్ రిలీజ్‌లోనూ దాదాపు 7.46 కోట్ల కలెక్షన్స్ సాధించి రీ రిలీజ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం సీక్వెల్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో ఖుషి పార్ట్ -2పై ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్ ప్రియాంక మోహనన్ కూడా ఖుషి-2 చేయాలని స్వయంగా ఎస్‌జే సూర్యను కోరారు. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. నానితో రెండోసారి నటిస్తున్నానని తెలిపారు. గ్యాంగ్‌లీడర్‌లో పెన్సిల్ , ప్రియ పాత్రలు ప్రేక్షకులకు బాగా నచ్చాయని ప్రియాంక చెప్పారు.
ఈ క్రమంలోనే ఆమె ఖుషి-2 గురించి ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం డైరెక్షన్‌ను పక్కనపెట్టి.. నటుడిగా బిజీ అయ్యారని, దీంతో మళ్లీ ఎప్పుడు మెగా ఫోన్ పట్టుకుంటారని ప్రియాంక ప్రశ్నించారు. ఖుషి-2ని మీ నుంచి ఆశించవచ్చా.. ఒకవేళ చేస్తే పవన్ కళ్యాణ్‌తోనే చేయండి అంటూ ఆమె కోరారు. ప్రస్తుతం ప్రియాంక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఖుషి-2 చేయాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు. అయితే ఖుషి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ స్క్రిప్ట్ రాశానని.. ఇది కూడా ప్రేమ కథేనని ఎస్‌జే సూర్య ఓ సందర్భంలో తెలిపారు. ఈ కథ పవన్ విని బాగుందన్నారని.. కానీ లవ్ స్టోరీస్ చేయలేనని, లవర్‌బాయ్‌గా కనిపించలేని తనకు లేదని ఈ స్టోరీని రిజెక్ట్ చేశారని ఎస్‌జే సూర్య వెల్లడించారు.


Click it and Unblock the Notifications











