కుప్పకూలిన బాలీవుడ్ కల, పాపం కాజల్

ఈ మధ్య తెలుగులో ఒక్క సినిమాకూడా లేకుందా పోయిన కాజల్...గంపెడాశలతో బాలీవుడ్ చేరింది. అక్కడకూడా తెలుగులో మాదిరిగానే దున్నేద్దాం అనే ఆశతో వెళ్ళిన కాజల్ కి టై మాత్రం కలిసి రానట్టే కనబడుతోంది. తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన చాలా మంది హీరోయిన్ల లాగానే కాజల్ కి కూడా అక్కడ భవిశ్యత్ ఉన్నట్టు లేదు.

రణ్ దీప్ హుడా తో చేసిన సినిమా "దో లఫ్జోన్ కి కహానీ" పై కాజల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో కాజల్ - రణదీప్ హుడా మధ్య లిప్ లాక్ ను కూడా బాగా హైలైట్ చేశారు. పాపం తనకు ఇష్టం లేకుండానే చేసిన లిప్ లాక్ కూడా హిందీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. దో లఫ్జోన్ కి కహానీ కి ఫ్లాప్ టాక్ రావటం తో కాజల్ తీవ్ర నిరాశలో పడిపోయింది.

Do Lafzon Ki Kahani a boring love story : Bolly wood report

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను అలరించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. గుడ్డిలో మెళ్ళ ఏమిటంటే సినిమాలో అమ్మడి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయంట... తన నటనకి ప్రశంసలు దక్కుతున్నాయని కాజలే కనపడ్డ వారికల్లా చెప్తోందిట.

ఇక తెలుగుకి వస్తే కాజల్ కి ఇప్పుడు సమంతా పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటివరకూ కాజల్ని తలకెత్తుకున్న వాళ్ళంతా సమంతా వెనక పడుతున్నారు. కాజల్ అవకాశాలని సమంతా అందుకుంటూ హ్యాపీగా ఉంది. ఈ ఏడాది హ్యాపీ హీరోయిన్ ఎవరూ అంటే సమంతా అనే చెప్పొచ్చు..

Do Lafzon Ki Kahani a boring love story : Bolly wood report

ఈ ఏడాది కాజల్ తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఒకటి పవన్ కల్యాణ్ సరసన అయితే మరొకటి మహేశ్ బాబు జోడీగా. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందినవే అయినా అయినా అవి పరాజయం పాలై కాజల్ కి నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో కాజల్ బాలీవుడ్ మూవీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేకపోవడం, ఆమెకి మరింత నిరుత్సాహాన్ని కలిగించే విషయమే. పాపం ఎలా తట్టుకుంటుందో ఏమో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X