అవి రూమర్స్ నమ్మద్దు: 'దూకుడు' నిర్మాత
మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పాటలు నెట్ లో లీకయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిర్మాత సుంకర అనీల్ తన ఫేస్ బుక్ పేజీలో ఆడియో లీకెడ్ అనేది రూమర్స్ అనీ..మహేష్ అబిమానులు ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు. అలాగే తాము మహేష్ ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని రూపొందిచటానికి కృషి చేస్తున్నామని, గోల్ ని చేరుకుంటామని చెప్పారు. అలాగే ఆడియో విడుదల అయ్యేదాకా బయిట ఎవరన్నా దూకుడు ఆడియో అమ్ముతున్నా కొనవద్దని కోరారు. ఛీటింగ్ ని పైరసీని ప్రోత్సహించవద్దని అన్నారు.


Click it and Unblock the Notifications











