అమితాబ్‌తో పోలికా? వర్మకు ఎక్కువైంది: మహేష్ బాబు
బిజినెస్ మేన్ సినిమా భారీ విజయం నేపథ్యంలో....మహేష్ బాబు లాంటి గొప్ప నటుడు ఈ దేశంలోనే లేరు, అమితాబ్‌ను కూడా మించి పోయాడు అంటూ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మహేష్ బాబు విలేకరుల సమావేశంలో స్పందిచారు. రామ్‌గోపాల్ వర్మ నా చిత్రాన్ని చూసి కొద్దిగా ఎక్కువగా ఎగ్జైట్ అయ్యారనిపించింది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఒక లెజెండ్. ఆయనతో నన్ను పోల్చడం సరికాదు అని వ్యాఖ్యానించారు. అమెరికాలో నా చిత్రాలకు స్పందన చాలా బాగుంది. రీమేక్ చిత్రాలు చేయడానికి నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమా హిట్ ముందుగానే ఊహించాము కాబట్టే చాలా కూల్‌గా ఉన్నాము. స్క్రిప్ట్‌ను, డైలాగులను, దర్శకునిపై ఉన్న పూర్తి విశ్వాసంతో ఈ చిత్రం చేయడంతో రెట్టింపు సక్సెస్ ఆనందాన్ని ఇచ్చింది అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు-కాజల్ జంటగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన బిజినెస్ మేన్ సంక్రాంతి సందర్భంగా విడుదలైన తెలుగు సినిమా రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. రెండు వారాల్లోనే ఈ సినిమా 75కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి..నెం.1 ఇండస్ట్రీ గ్రాసర్‌గా నిలిచింది. విడుదల విషయంలోనూ ఈ సినిమా సంచలనమే. దాదాపు రెండు వేల థియేటర్లలో విడుదలై మహేష్ బాబు సినిమా స్టామినాను పరిశ్రమకు రుచి చూపింది.


Click it and Unblock the Notifications











