అతనితో కూడా సంభందం అంటగడతారా? కాజల్
ఇప్పుడు రామ్ చరణ్, ఆ తర్వాత జూ ఎన్టీఆర్, నెక్ట్స్ మరో హీరో ఇలా నేను కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. అయినా నేను రెండోసారి చరణ్ తో చేస్తున్నాననే కదా ఆ టాక్..అలా అయితే ప్రభాస్ తో కూడా రెండో చిత్రం చేస్తున్నాను. అతనితో కూడా సంభందం అంటగడతారా అని నిలదీస్తోంది కాజల్ అగర్వాల్. ఆమె తాజాగా రామ్ చరణ్ తో మెరపు చిత్రంలో చేయటానికి కమిట్ అయిన సందర్భంగా రామ్ చరణ్ తో ఆమె ప్రత్యేకమైన రిలేషన్ ఉందంటూ రూమర్స్ వచ్చాయి. అందుకే మగధీర తర్వాత కావాలనే పట్టుపట్టి రామ్ చరణ్ ఆమెను మెరుపు చిత్రంలోకి తీసుకొచ్చారని గుసగుసలు విన్పించాయి. ఆ విషయం మీడియా ప్రస్దావిస్తే దానికి సమాధానంగా పై విధంగా చెప్పుకొచ్చింది. అలాగే నేను..రామ్ చరణ్ పెయిర్ గా ఉండటాన్ని జనం బాగా ఎంజాయి చేస్తున్నారు. కాజల్..షారూఖ్ జోడి లాంటిది ఇది అంటోంది. నేను మరోసారి కూడా రామ్ చరణ్ ప్రక్కన చేయటానికి రెడీగా ఉన్నాను. ఒకసారి చేసిన వారితో మరోసారి చేయటం చాలా కంపర్ట్ గా ఉంటుంది. ప్రస్తుతం కాజల్..ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. అలాగే నాగచైతన్య హీరోగా సుకుమార్ రూపొందించే చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











