Akhandaను డీ కొట్టిన విలన్ ఆర్మీ ఆఫీసర్ అట తెలుసా.. ఆ యుద్దంలో గాయపడి!
ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. 'అఖండ' నామస్మరణే. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఈ హిట్ ఊహించిందే. కానీ ఊహించిన దానికంటే 'అఖండ' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గురించిన అన్ని విషయాల మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

అద్భుతాలు సృష్టిస్తోంది
బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత కొనసాగుతోంది. ఎందుకంటే అఖండ సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. అంచనా వేసిన దానికంటే ప్రేక్షకులకు సినిమా నచ్చడంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం 60 శాతం రిటర్న్స్ తీసుకొచ్చింది. నాలుగో రోజు కూడా అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.8 కోట్లకు పైగా వసూలు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నా బాలయ్యకు లాజిక్ అవసరం లేదని అభిమానులకు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ సినిమా. అందుకే కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే వస్తున్నాయి. మూడు రోజుల తర్వాత చూస్తే దాదాపు 36 కోట్ల షేర్ అఖండ ఖాతాలో వచ్చి చేరింది. అఖండ సినిమాకు రూ.53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగగా 54 కోట్లు వసూలు చేస్తే సేఫ్ అవుతుంది.

భయపెట్టే విధంగా
ఆ సంగతి అలా ఉంచితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బోయపాటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో విలన్ పాత్రలు కూడా సమానంగా పవర్‌ఫుల్‌గా, బలంగా ఉంటాయి. లెజెండ్ తో జగపతిబాబుకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి అఖండలో కూడా బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్‌ను భయపెట్టే విధంగా చూపెట్టారు బోయపాటి. అయితే శ్రీకాంత్‌తో పాటు అఖండలో మరో విలన్‌గా నటించారు నితిన్ మెహతా.

ఆర్మీ ఆఫీసర్
ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసిన నితిన్ మెహతా ఒకప్పుడు ఆర్మీ ఆఫీసర్ అట. 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో సేవలు అందించిన ఆయన నటుడిగా మారాలని కలలు కని.. తన యూనిఫామ్ ను తీసి పక్కన పెట్టి ఒక ఒక ప్రొఫెషనల్ మోడల్ గా మారి బాలీవుడ్ లో 'కాబిల్', 'భూమి' వంటి సినిమాల్లో నటించారు. ఇక దక్షిణాదిలో ఒకట్రెండు సినిమాల్లో నటించారు కానీ పెద్దగా గుర్తింపు తీసుకోలేకపోయాయి.

నితిన్ కు మంచి బ్రేక్
కానీ అయితే 'అఖండ' మాత్రం నితిన్ కు మంచి బ్రేక్ ఇచ్చింది అన చెప్పాలి. ఈ సినిమాతో హాట్ టాపిక్ గా మారారు నితిన్ మెహతా. నితిన్.. ఒక యుద్ధం సమయంలో గాయాలపాలవడంతో స్వచ్ఛందంగా పదవీ విరమన చేసి తన ప్యాషన్ ను సాధించుకునే పనిలో పడ్డారు. అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తద్వారా సౌత్ లో అడుగు పెట్టారు. ఇదండీ నితిన్ మెహతా కదా కమామిషు.


Click it and Unblock the Notifications











