అమితాబ్ బచ్చన్ ఆస్తి విలువ 1578 కోట్లు.. బ్యాంకులో నగదు ఎన్ని కోట్లు ఉందో తెలుసా?

ఇండియన్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయబచ్చన్ తమ ఆస్తులను ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు 5వసారి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జయ బచ్చన్‌తోపాటు బిగ్ బీ తమ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను ప్రకటించారు. బాలీవుడ్ దిగ్గజాల ఆస్తుల వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ సీనియర్ నటి జయబచ్చన్ రికార్డు స్థాయిలో రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా జయ తన ఆస్తుల వివరాలను తెలియజేస్తూ.. 2022-23 సంవత్సరానికి వ్యక్తిగత ఆస్తుల విలువ 1.63 కోట్లుగా తెలియజేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ తన ఆస్తుల విలువ 273 కోట్లుగా పేర్కొన్నారు.

Do You Know Amitabh Bachchans net Bank Balance? Here Big Bs Combined Net Worth is 1578 Crores?

ఇదిలా ఉండగా, జయబచ్చన్ తన బ్యాంకులో నగదు విలువను 10 కోట్లుగా చూపిస్తే.. అమితాబ్ బచ్చన్ తన బ్యాంకులో నగదు 120 కోట్లుగా చూపించారు. అలాగే వారి ఉమ్మడి స్థిర ఆస్తుల విలువను 849 కోట్లుగా చూపించారు. చర ఆస్తుల విలువ 729 కోట్లుగా వెల్లడించారు. దాంతో వారి ఉమ్మడి స్థిర, అస్థిర ఆస్తులు విలువ 1578 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు.

Do You Know Amitabh Bachchans net Bank Balance? Here Big Bs Combined Net Worth is 1578 Crores?

జయ తన వద్ద 40 కోట్ల రూపాయల విలువైన జ్యువెల్లరీ,9.82 లక్షల విలువైన ఓ కారు ఉందని పేర్కొన్నారు. ఇక అమితాబ్ బచ్చన్ 54 కోట్ల విలువైన జ్యువెల్లరీ, 17.66 కోట్ల విలువైన 16 వాహనాలు ఉన్నాయని, అందులో ఒక మెర్సెడెజ్ బెంజ్, ఓ రేంజ్ రోవర్ ఉన్నట్టు చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X