దుమ్ము లేపుతున్న హనుమాన్.. గుంటూరు కారం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ టికెట్లు అమ్మడయ్యాయో తెలుసా?
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే ఆరు సినిమాలు విడుదల అయ్యాయి. ముఖ్యంగా ఇందులో నాలుగు తెలుగు చిత్రాలే ఉండగా.. రెండు ఇతర భాషల సినిమాలు ఉన్నాయి. ఈక్రమలోనే సినీ ప్రియులు అందరూ తమకు నచ్చిన చిత్రాలు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తమ ఫేవరెట్ హీరో చిత్రంతో పాటు పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్ద ఎత్తున టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హనుమాన్, గుంటూరు కారం చిత్రానికి పెద్ద ఎత్తున టికెట్లు బుక్ అవుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా హనుమాన్ సినిమాకు టికెట్లు బుక్ అవుతుండగా.. గుంటూరు కారం కంటే ఎన్ని రెట్ల టికెట్లు ఎక్కువ అయ్యాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గడిచిన 24 గంటల్లో.. అంటే జనవరి 13వ తేదీ ఉదయం నుంచి జనవరి 14వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల అయిన హనుమాన్ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. చూస్తుండగానే టికెట్లు అన్నీ బుక్ అయి థియేటర్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. అయితే హనుమాన్ సినిమాకు గడిచిన 24 గంటల్లోనే.. బుక్ మై షోలో 426.02కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 4 లక్షల 26 వేల 20 టికెట్లు బుక్ అయ్యాయి. ఇలా ఈ సినిమా టాప్ 1లో నిలిచింది.

ఇక టాప్ 2లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నిలవగా.. 145.82కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే లక్షా 45 వేల 820 టికెట్లు బుక్ కాగా.. హనుమాన్ సినిమాకంటే మూడు రెట్లు తక్కువగా రెస్పాన్స్ వచ్చింది. ఇది కేవలం బుక్ మై షో ప్రకారమే అయినప్పటికీ గుంటూరు కారం కంటే కూడా హనుమాన్ చూసేందుకే ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నట్లు అర్థం అవుతుంది. ఆ తర్వాత స్థానంలో ధనుష్ కెప్టెన్ మిల్లర్ నిలిచిపోయింది. గడిచిన 24 గంటల్లో 138.92కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే లక్షా 38 వేల 920 టికెట్లు కేవలం బుక్ మై షోలో బుక్ అయ్యాయి. ఇలా కెప్టెన్ మిల్లర్ టాప్ 3లో నిలిచింది.
ఇక తర్వాతి స్థానంలో అంటే టాప్ 5లో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన అయలాన్ సినిమా నిలిచింది. 134.01కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే లక్షా 34 వేల 10 టికెట్లు. ఈ సినిమాకు ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రానికి కేవలం నాలుగు వేల తేడానే ఉంది. అలాగే గుంటూరు కారంతో పోలిస్తే కేవలం 10 వేల టికెట్లు మాత్రమే తగ్గాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో అంటే టాప్ 5లో విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్ సినిమా నిలిచింది. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో ద్వారా 60.83కే టికెట్లు బుక్ అయ్యాయి. కేవలం 60 వేల 830 మంది మాత్రమే ఈ సినిమా చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.

ఇక చివరగా ఈరోజే విడుదల అయిన నాగార్జున నా సామి రంగా నిలిచింది. టాప్ 6లో ఈ సినిమానే ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ చిత్రానికి రెస్పాన్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు 44.72కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 44 వేల 720 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. చూడాలి మరి ఈ సినిమాకు రేపటి నుంచి మరింత రెస్పాన్స్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది.


Click it and Unblock the Notifications











