Manobala Passed Away.. మనోబాలకు నచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా? తీరని కోరిక అదేనా?
తమిళ, తెలుగు సినిమా రంగాలతోపాటు దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న హాస్య నటుడు, నిర్మాత, దర్శకుడు మనోబాల ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఇటీవల కాలేయ వ్యాధికి గురయ్యారు. కొద్దికాలంగా ఆయన ఆరోగ్య సమస్యలకు ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ బుధవారం మే 3వ తేదీన మరణించారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఆయన మరణంతో తమిళ, తెలుగు సినిమా పరిశ్రమ విషాదంలోకి మునిగిపోయింది. మనోబాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
700 పైగా చిత్రాల్లో నటించి.. :మనోబాల నటించిన చిత్రాల విషయానికి సుమారు 700 సినిమాలకుపైగా నటించారు. పితామగన్, ఐస్, చంద్రముఖి, యారాడి నీ మోహిని, తమీజ్ పదమ్, అలెక్స్ ప్యాండ్యన్, అరణ్‌మణై సీక్వెల్ అంబాల లాంటి చిత్రాలతో చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన తనదైన శైలిలో విరిచి చెప్పే డైలాగ్స్ కారణంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నారు.

తెలుగు సినిమాలు ఇవే.. :2008 సంవత్సరంలో రజనీకాంత్ నటించిన కథానాయకుడు సినిమా ద్వారా తెలుగులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ నటించిన పున్నమినాగు, అనంతరం మనసు మాయ సేయకే, డేగ, థోజా, రాజాధిరాజా, నాయకి, మహానటి, సీమ రాజా, రాజ్‌దూత్, కాలేజ్ కుమార్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. చంద్రముఖి లాంటి పలు తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం..:అయితే ఇటీవల తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగులో తనకు ఇష్టమైన నటుడి గురించి మనసులో మాట చెప్పారు. నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఇక్కడ అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత ఆయన పాపులారిటీ పెరిగిపోయింది.అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయనను కలుసుకోవాలని ఉంది. కానీ కుదరడం లేదు. నన్ను ఎవరు ఆయనను కల్పించడం లేదు అని అన్నారు.

చివరి సినిమాలు ఏవంటే? :ప్రముఖ దర్శకుడు భారతీరాజా డైరెక్షన్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన వందలాది సినిమాల్లో నటించార. కొండ్రాల్ పావన్, కాజల్ అగర్వాల్ నటించిన ఘోస్ట్ మనోబాల నటించిన చివరి సినిమాలుగా గుర్తుండిపోతాయి. ఆయన మృతికి దక్షిణాదిలో పలువురు సినీ తారలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











