Balakrishna: గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ... ఈ సినిమాల్లో బాలయ్య ఓటు దేనికో తెలుసా?
ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నాలుగు తెలుగు చిత్రాలు నిలిచాయి. ముందుగా మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం, తేజా సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ చిత్రాలు జనవరి 12న రిలీజ్ అయ్యాయి. ఇక ఆ తర్వాత ఒక రోజు లేటుగా వెంకటేష్ తన 75వ చిత్రం సైంధవ్ రిలీజ్ కాగా.. రెండు రోజులు లేటుగా జనవరి 14న నాగార్జున నా సామి రంగ రిలీజ్ అయింది. అయితే సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలున్నా... నందమూరి బాలకృష్ణకు నచ్చిన చిత్రం ఏంటో తెలుసా.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ పండక్కి బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోలతో పాటు ఓ కుర్ర హీరో పోటీ పడ్డాడు. నాగార్జున, వెంకటేష్, మహేశ్ బాబు లాంటి సీనియర్ హీరోలతో ఓ యంగ్ కుర్రాడు తేజ సజ్జా బరిలోకి దిగాడు. ఇక తన హనుమాన్ సినిమాతో.. ఆ మూడు చిత్రాలను ఢీకొట్టాడు. అందుకు తగ్గట్లుగానే ఈ నాలుగు చిత్రాల్లో అందరి ఓటు హనుమాన్ కే పడుతుంది. గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు రెండు ఒకరోజు రిలీజ్ అయ్యాయి.

అయితే మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది. అయితే ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేదు. ఇక ఈ సినిమాతో పాటు పోటీగా వచ్చిన హనుమాన్ చిత్రం మాత్రం మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫలితంగా థియేటర్లు కూడా పెరిగాయి. ఇక ఆ తర్వాత సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అయ్యాయి. ఇవి కూడా మోస్తరు టాక్ ను అందుకున్నాయి.
కలెక్షన్ల పరంగా చూసుకున్న ఈ మూడు చిత్రాల్లో హనుమాన్ చిత్రానికి భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. చిన్న చిత్రంగా రిలీజ్ అయి.. ప్రభంజనం సృష్టిస్తుంది. ఇక తాజాగా వంద కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ. ఇదిలా ఉంటే... నందమూరి బాలకృష్ణ ఈ నాలుగు చిత్రాల్లో మెచ్చిన చిత్రం ఏంటో తెలిసిపోయింది. బాలయ్యకు అంత త్వరగా ఏ సినిమాలు నచ్చవు. కానీ బాలయ్యనే ఈ సారి మెచ్చిన చిత్రం ఏంటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నా సామి రంగ, సైంధవ్, గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఉండగా.. వీటిలో బాలయ్యకు నచ్చిన చిత్రం హనుమాన్. ఈ సినిమాకే బాలయ్య ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ టాక్ తో పాటు.. ఈ సినిమాలోని విజువల్స్ చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే బాలయ్య కూడా ఈ సినిమాను చూడాలనుకుంటున్నారు. అందుకు ఈ రోజు హైదరాబాద్ లో బాలయ్య హనుమాన్ స్పెషల్ షోను చూడనున్నారు.

ఇక బాలయ్యకు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ నచ్చిందని తెలుస్తోంది. ఇక వీరి కాంబోలో కూడా ఓ సినిమా రానుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. హనుమాన్ చిత్రంలో బాలయ్య రిఫరెన్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను బాలయ్య చూసి ఏం అంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











