నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాను పవన్ చేసి హిట్ కొట్టాడా.. ఆ సినిమా ఏంటో తెలుసా?

ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న కథ మరొకరితో అవుతుంది. ఒక హీరోకు చెప్పాల్సిన కథ మరో హీరో వద్దకువెళ్తుంది. కథ నచ్చినా కొన్నిసార్లు ఆ హీరోలు చేయలేక మరో హీరో దగ్గరకు పంపుతారు. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక అలా ఒక హీరో వదిలేసుకున్న కథ మరో హీరో చేసి హిట్ కొడితే.. అరెరే అనవసరంగా ఆ హీరో మంచి సినిమాను, మంచి హిట్ ను మిస్ అయ్యాడే అన్న ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ఆ ఫీల్ లోనే ఉన్నారని తెలుస్తోంది.

ఒక సూపర్ హిట్ ఫిల్మ్ ను నాగ్ రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిందట. ఇక పవన్ ఓకే చెప్పడంతో.. అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అంతేకాదు ఈ సినిమా వలన అతనికి చాలా లాభాలు చేకూరాయి. ఆ సినిమా ఏదో కాదు బద్రి. పవన్ కెరీర్ లో తీసుకొచ్చి పెట్టిన సినిమా బద్రి. నువ్వు నంద అయితే ఏంటి.. నేను బద్రి .. బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.

Do you know pawan kalyan had a blockbuster film badri which was rejected by nagarjuna Akkineni

అంతలా హిట్ అయిన ఈసినిమాకు మొదట హీరోగా నాగార్జునను అనుకున్నాడట డైరెక్టర్ పూరిజగన్నాథ్. అదే విషయాన్నీ నాగ్ కు చెప్పి.. బద్రి కథను కూడా వినిపించాడట. కానీ, అప్పటికే నాగ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడట. కథ నచ్చినా.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక.. నాగ్ నో చెప్పడంతో బద్రి కథ పవన్ వద్దకు చేరింది. ఇక బద్రి కథ చెప్పినప్పుడు పవన్ పూర్తిగా వినకుండానే క్లైమాక్స్ చేంజ్ చేసి తీసుకురమ్మన్నాడట. అయితే క్లైమాక్స్ చేంజ్ చేయడం ఇష్టం లేని పూరి.. అదే క్లైమాక్స్ తో మరోసారి పవన్ వద్దకు వెళ్లి కథను వినిపించాడు. అదేంటి.. నిన్న చెప్పిన కథనే మళ్లీ చెప్పావ్.. క్లైమాక్స్ చేంజ్ చేయమని చెప్పా కదా అని పవన్ అంటే.. నాకు క్లైమాక్స్ చేంజ్ చేయడం ఇష్టం లేదు.. నిన్న మీరు కథ పూర్తిగా వినలేదు అనుకోని మరోసారి చెప్పడానికి వచ్చాను అని పూరి చెప్పగా.. ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చి పవన్ వెంటనే బద్రి కథను ఓకే చేశాడు.

అలా బద్రి సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈ సినిమా వలనే పవన్ కు.. రేణు పరిచయమయ్యింది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. పెళ్లి అయ్యింది. ఇక ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పవన్ కు మాస్ హీరో అనే పేరును తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత పవన్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా నాగ్ చేయాల్సిన బద్రి.. పవన్ రేంజ్ నే మార్చేసింది.

Do you know pawan kalyan had a blockbuster film badri which was rejected by nagarjuna Akkineni

ఇక ఈ సినిమా తరువాత పూరి.. నాగ్ కోసం శివమణి కథను సిద్ధం చేశాడు. నా పేరు శివమణి.. నాకొంచెం తిక్క అని నాగ్ లో మరోకోణాన్ని చూపించి పూరి హిట్ కొట్టాడు. ఆ తరువాత వీరి కంబోలోనే సూపర్ సినిమావచ్చింది . ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ద్వారానే అనుష్క ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.ఒకవేళ బద్రి .. నాగ్ చేసి ఉంటే ఎలా ఉండేదో అని అభిమానులు ఉహించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X