Game Changer: గేమ్ ఛేంజర్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ పవన్, రాంచరణ్ కాదా? ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఇపుడు పాన్ ఇండియా వైడ్ గా మళ్ళీ ఆడియెన్స్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్న లేటెస్ట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా మరో భారీ సినిమా పుష్ప 2 కోసం కూడా మాట్లాడుకున్నారు కానీ ఇపుడు పుష్ప 2 రన్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక దీనితో అందరి దృష్టి గేమ్ ఛేంజర్ మీదే పడింది.

కాగా గేమ్ చేంజర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తే పాన్ ఇండియా సినిమాని ఎలివేట్ చేసిన దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించారు. కాగా ఇప్పుడిలా గేమ్ ఛేంజర్ మేనియా అంతా కొనసాగుతూ ఉండగా ఇది శంకర్ కి తెలుగులో మొట్ట మొదటి సినిమా అని అందరికీ తెలిసిందే. కాగా శంకర్ ఇపుడు వరకు తెలుగులో చాలాసార్లు సినిమా చేద్దామని ఆగిపోయారు.

Do You Know Ram Charan Pawan Kalyan are not Shankar s First Choice for Game Changer

కానీ తన తమిళ్ సినిమాలు మాత్రం తెలుగులో సంచలనం సృష్టించినవి కూడా లేకపోలేవు. కాగా శంకర్ తెలుగులో సినిమా కోసం అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న సినిమా సాధ్య పడలేదు. అలాగే తర్వాత ప్రభాస్, మహేష్ బాబు లాంటి వారితో కూడా చేద్దాం అనుకున్నవి కూడా సెట్ కాలేదని రీసెంట్ గా రివీల్ చేశారు. ఇలా ఫైనల్ గా రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ ని సెట్ చేశారు.

అయితే ఈ సినిమాకి కూడా శంకర్ మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు దగ్గరకి ఈ కథతో సినిమా ప్లాన్ చేసినపుడు శంకర్ పవన్ కళ్యాణ్ పేరు మొదటగా చెబితే దిల్ రాజు రామ్ చరణ్ తో చేద్దామని తీసుకెళ్లారు. కాగా ఈ సినిమా విషయంలో ఇంకా ఇంట్రెస్టింగ్ అంశాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది.

Do You Know Ram Charan Pawan Kalyan are not Shankar s First Choice for Game Changer

నిజానికి శంకర్ తెలుగులో సినిమా చేద్దాం అనుకున్నారు కానీ ఆ సినిమా గేమ్ చేంజరే అని ఫిక్స్ అవ్వలేదట. తెలుగు కంటే ముందే తమిళ్ లో చెయ్యాలని శంకర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఎప్పుడో 2019 లోనే సినిమా చెయ్యాలని శంకర్ అనుకున్నారట. మరి తెలుగులో అయితే పవన్ కళ్యాణ్ ని శంకర్ అనుకున్నారు కానీ తమిళ్ లో ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ ఎవరో కాదు తమిళ నాట బిగ్గెస్ట్ స్టార్ విజయ్ దళపతి అట.

తనతో ఇదే సినిమా 2019 లోనే శంకర్ కాంబినేషన్ లో లాక్ అయ్యింది కానీ అప్పుడు కొన్ని పరిస్థితులు ఇతర కమిట్మెంట్స్ మూలాన అప్పుడు సాధ్య పడలేదు అట. ఆ తర్వాత శంకర్ తెలుగులో ఇదే చేద్దామని అనుకోని మొదట పవన్ కళ్యాణ్ తో అనుకుంటే తర్వాత ఫైనల్ గా గ్లోబల్ స్టార్ దగ్గరకి వచ్చింది. ఇక ఇపుడు ఫైనల్ గా ఇండియా వైడ్ ఈ సినిమా మంచి అంచనాలు రేపి విడుదలకి రాబోతుంది.

More from Filmibeat

Read more about: shankar pushpa 2 ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X