మరణానికి ముందే సమాధిని నిర్మించుకొన్న రామోజీరావు.. ఆ స్మారక మందిరం వీడియో వైరల్!
ఇండియన్ మీడియా మొఘల్ రామోజీరావు అస్తమయం అన్ని వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సినిమా, రాజకీయ వర్గాలు ఆయన మరణ వార్త తెలియగానే ఓ రకమైన షాక్ గురయ్యారు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన పార్తీవ దేహన్ని చివరిసారిగా సందర్శించి శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఆ వివరాల్లోకి వెలఇతే..
అతి సామాన్య జీవితం నుంచి రామోజీరావు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దేశ రాజకీయ వ్యవస్థను శాసించే విధంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించారు. దేశంలోని అన్ని భాషల్లో కూడా ఆయన టెలివిజన్ ఛానెల్స్ ద్వారా న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలపై అధిపత్యం కొనసాగించారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు.

ఇక వినోద పరిశ్రమకు సంబంధించి సినిమాలు నిర్మించడమే కాకుండా.. అందరికి అందుబాటులో ఉండే విధంగా సినీ నిర్మాణం కోసం రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. బాలీవుడ్, తమిళ, మలయాళ, కన్నడ, ఇతర భాషల సినిమాల నిర్మాణానికి అడ్డగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దారు.
అయితే అలాంటి ప్రతిష్టాత్మక ఫిలిం సిటీలో ఎత్తైన కొండపై నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఆయన అక్కడే ఉంటూ వ్యాపార, రాజకీయాలు, మీడియా వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. అన్ని విషయాలను ఆ ప్రాంతం నుంచే ఫోకస్ చేసే వారు. సీఎంలు, మంత్రులైనా ఆ ప్రాంతానికి వెళ్లి కలిసే వాళ్లంటే ఆయన స్థానం ఏంటో గ్రహించాల్సిందే.

అయితే తన మనసుకు నచ్చిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలోనే తన మరణానికి ముందు సమాధిని నిర్మించుకొన్నారు. ఆ ప్రాంతాన్ని తన స్మారక మందిరంగా మార్చుకొన్నారు. ఈ ప్రదేశంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన మరణానికి ముందే సమాధి, స్మారక మందిరాన్ని నిర్మించుకొన్న అతి కొద్ది ప్రముఖుల్లో ఒకరిగా రామోజీ రావు ఘనతను సంపాదించుకొన్నారు.


Click it and Unblock the Notifications











