చాలా మంది హీరోలతో స్టార్ హీరోయిన్ లవ్ ఫెయిల్యూర్స్.. ఈ మాజీ ప్రధాని మనవరాలి ట్రాజెడీ స్టోరీ మీకు తెలుసా?

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తొలి వెబ్ సిరీస్ హీరామండి కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె గురించిన వివరాల్లోకి వెళితే..

90వ దశకంలో తన అందంతో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన ఒకప్పటి అందాల భామ మనీషా కోయిరాలా చిన్నప్పటి ఫోటో ఇది. సౌత్ నుంచి నార్త్ దాకా ఆమె నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఒకప్పుడు ఇండస్ట్రిని ఏలిన ఈ హీరోయిన్ కు ఇప్పుడు ఆమె వయసు 53 ఏళ్లు. భర్తతో విడాకులు తీసుకుంది. ఈ నటికి పిల్లలు లేరు. ఆమె తండ్రి, తాత రాజకీయ ప్రపంచంలో ఇంకా చురుకుగా ఉన్నారు.

Do You Know Senior Actress Manisha koirala emotional life story her childhood pic goes viral

సౌదాగర్, ఫస్ట్ లవ్ లెటర్, అగ్ని సాక్షి, మజ్ధర్, ఇండియన్, ఖామోషి, సలాఖానే, గుప్త్, కచ్ఛే ధాగే, దిల్ సే, రాజా కో రాణి సే ప్యార్ హో గయా హిందీ సినిమాలలో మనీషా అద్భుత నటనను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. తాజాగా సంజయ్ లీలా బన్సాలీ 'హిరామండి' వెబ్ సిరీస్‌లోని 'మల్లికా జాన్' అనే పాత్రలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది మనీషా కోయిరాలా. హిరామండి వెబ్ సిరీస్ తాజాగా రిలీజ్ అయిన నేపథ్యంలోనే ఆమె చిన్ననాటి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మనీషా కొయిరాలా రాజకీయంగా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు, ప్రకాష్ కొయిరాలా కుమార్తె, నేపాల్ మాజీ ప్రధాని బిశేశ్వర్ ప్రసాద్ మనవరాలు మనీషా. నేపాలీ చిత్రం ఫేరి భేటౌలా (1989)లో తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. హిందీ చిత్రం సౌదాగర్ (1991)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఈ చిత్రం తర్వాత మనీషా హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, నేపాలీ, ఆంగ్ల చిత్రాలలో నటించింది.మనీషా తన 33 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 70 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ 33 ఏళ్లలో ఎందరో సౌత్, నార్త్ సూపర్‌ స్టార్‌లతో కలిసి పని చేశారు ఆమె.

Do You Know Senior Actress Manisha koirala emotional life story her childhood pic goes viral

ఇక మనీషా కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు ఎఫైర్ల గురించి రుమార్లు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. నటులు వివేక్ ముష్రాన్, నానా పటేకర్, డిజే హుస్సేన్, నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియన్ అంబాసిడర్ క్రిస్పిన్ కాన్రాయ్‌లతో మనీషా రిలేషన్ షిప్ లో ఉందని అప్పట్లో రూమర్లు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం మనీషా నానా పటేకర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే అప్పటికే అతనికి పెళ్లైపోవడంతో నానాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. మనీషా 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లాడింది. అయితే 2012లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.అప్పటి నుండి మనీషా కొయిరాలా తన నటనా జీవితంపైనే దృష్టి పెట్టింది. ఆ తర్వాత క్యాన్సర్‌తో తన పోరాటం గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X