AP Elections 2024 వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి.. ఆ స్టార్ హీరోపై రాళ్ల దాడి.. కంటికి తీవ్రగాయం!

ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతున్నది. అధికార పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆ రాయిదాడిపై విమర్శలు, పరామర్శలు భారీగానే కొనసాగాయి. అయితే రాజకీయాల్లో ఏకంగా సీఎంపై రాయి దాడి జరపడం అనేక అనుమానాలు, రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇలానే ఓ సినీ నటుడు, రాజకీయ నేతపై కూడా తీవ్రమైన రాళ్లదాడి జరిగింది. ఆ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆ రాయి దాడిలో గాయపడిన సూపర్ స్టార్ వివరాల్లోకి వెళ్లితే..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది. ప్రధాన పార్టీల నాయకులందరూ కాంపెయినింగ్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే హామీలు, విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అయితే ఇటీవల తన ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్‌ను గులకరాయితో కొట్టారనే వార్త వివాదంగా మారింది.

Do You Know Super Star Krishna eye hurted in Stone pelting incident like YS Jagan attack

అయితే వైఎస్ జగన్‌ను రాయితో కొట్టడం తప్పని అధికార పక్షం ఖండిస్తే..ప్రతీ పక్ష నాయకులు మరో కోడికత్తి ఉదంతం అనే విషయాన్ని గట్టిగా ప్రస్తావించారు. ఇలా ఆ రాయి దాడి ఘటనపై ఓ వారం రోజులు మీడియాలో హల్‌చల్ రేగింది. అయితే బ్యాండేజ్‌తోనే వైసీపీ అధినేత ప్రచారం చేయడం తెలిసిందే.

అయితే 80వ దశకంలో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు.. సినీ పరిశ్రమ రెండు వర్గాలు చీలిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ, జమున, జగ్గయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం, పోటీలో పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్‌ను కొందరు నేతలు వ్యక్తిగతంగా దూషించడంతో నందమూరి అభిమానులు తీవ్రంగా మనోవేధనకు గురయ్యారు.

Do You Know Super Star Krishna eye hurted in Stone pelting incident like YS Jagan attack

ఇలా సూపర్ స్టార్ కృష్ణ రాజకీయంగా విబేధించి విమర్శనాస్త్రాలు భారీగానే సంధించారు. అయితే ఏలూరు పార్లమెంట్‌కు పోటీ చేస్తూ ఆయన ఓ సభలో మాట్లాడుతుండగా.. జనం నుంచి ఓ వ్యక్తి రాయితో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో సూపర్ స్టార్ కృష్ణ కంటికి తీవ్రమైన గాయమైంది. అయితే ఆ ఘటనను ఎన్టీఆర్‌తో సహా అన్ని పార్టీలు ఖండించాయి. వ్యక్తిగత దాడులకు తావు లేదని ఐక్యంగా తమ వాదనను వినిపించారు. ఆ గాయం నుంచి కృష్ణ త్వరగానే కోలుకొన్నప్పటీకీ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు వెల్లడించడం గమనార్హం.

అయితే ఏపీలో రాళ్ల దాడి ఘటన కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి ప్రచారం చేస్తుండగా.. రాయలసీమ ప్రాంతంలో ఆయనను కోడిగుడ్లతో కొట్టడం వివాదంగా మారింది. తాజాగా ఓ వ్యక్తి జగన్‌ను కూడా కోడిగుడ్డుతో కొట్టడం గమనార్హం. అయితే జగన్‌పై దాడి ఘటనే అత్యంత వివాదాస్పదమైంది. చివరకు చెల్లెల్లు షర్మిల, సునీత కూడా సానుకూలంగా స్పందించకపోగా.. పైగా విమర్శలు చేయడం వివాదమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X