బాలకృష్ణతో సూపర్‌స్టార్ కూతురు హీరోయిన్ రొమాన్స్.. ఫ్యాన్స్ ఆగ్రహం!
సినిమా రంగంలో ఒక తరం స్టార్ హీరోల పిల్లలు కలిసి నటించడం సాధారణంగా కనిపించే విషయమే. కానీ ఒకప్పుడు ఒక హీరో కొడుకు. .మరో హీరో కూతురుతో నటించడాన్ని ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా తీసుకోనే వాళ్లు.. ఆ హీరో కొడుకు పక్కన మా హీరోగారి కూతురు హీరోయిన్‌గా నటించడమేంటి? అనే అభ్యంతరాలు డైరెక్ట్‌గా వ్యక్తం చేసేవారు. అలాంటి సంఘటనే బాలకృష్ణ సినిమాకు ఎదురైంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్టార్ హీరో డాటర్ ఆ సినిమా నుంచి తప్పుకొన్నది. ఇంతకు ఆ సినిమా ఏంటి? ఆ స్టార్ హీరో కూతురు ఎవరనే వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో 80, 90వ దశకంలో ఎస్వీ కృష్ణారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చే సమయం అది. ఆయన తీసిన ప్రతీ మూవీ కామెడీకి పెద్ద పీట వేయడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తప్పించడానికి కారణమైంది. అప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన ఆయన బాలకృష్ణతో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అందుకు బాలయ్య కూడా ఒకే చెప్పారు.

బాలయ్య, కృష్ణారెడ్డి సినిమాకు టాప్ హీరో అనే టైటిల్ అనుకొన్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేనిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని ప్లాన్ చేశారు. కృష్ణ గారు కూడా అందుకు ఒకే చెప్పారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా మంజుల లాంచ్ కూడా సెట్ అయింది. ఆ వార్తను మీడియాకు అధికారికంగా విడుదల చేశారు.
అయితే బాలకృష్ణ పక్కన మంజుల హీరోయిన్ అనగానే కృష్ణ అభిమానులు షాక్ గురయ్యారు. దాంతో మా హీరో కూతురును బాలయ్య పక్కన నటిస్తే ఒప్పుకోనిది లేదని భారీగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అయితే కృష్ణ గారు తన ఫ్యాన్స్‌కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులు తన బెట్టుపై మెట్టు దిగకుండా ఒప్పుకోకపోవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నారు.

అలా నందమూరి హీరో పక్కన ఘట్టమనేని హీరోయిన్ నటించే అరుదైన అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు కోల్పోయారు. ఇక నటిగా రాణించాలనే మంజుల కోరికకు అలా తెరపడింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆమె మలయాళ పరిశ్రమ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చారు. చివరకు నీలకంఠ దర్శకత్వం వహించిన షో సినిమా ద్వారా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

ఇదిలా ఉండగా, టాప్ హీరో సినిమా కోసం మంజుల తర్వాత సౌందర్యను హీరోయిన్‌గా తీసుకొన్నారు. ఈ సినిమాకు అచ్చిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడి, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అందించారు. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











