Shahrukh Khan Jawan విక్రమార్కుడు, జైలర్ సినిమాలకు జవాన్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి షారుఖ్ ఖాన్ ఫర్మామెన్స్ నెక్ట్స్ లెవెల్ అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా.. షారుఖ్ ఖాన్ నటించిన ఈ జవాన్ సినిమాకు... సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలకు లింక్ ఉంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ షారుఖ్ నటించిన చిత్రం జవాన్ థియేటర్లోకి వచ్చింది. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా... లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక విలన్ గా విజయ్ సేతపతి నటించగా.. అతిథి పాత్రలో దీపికా పదుకునే నటించింది. ఇక ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రలలో నటించారు.

Do you know the link of Shahrukh Khan Jawan to the movies Raviteja Vikramarkudu and Rajinikanth Jailer?

దాదాపు రూ.300కోట్ల రూపాయలతో జవాన్ మూవీని షారుఖ్‌ ఖాన్‌ హోంబ్యానర్ రెడీ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించింది. ఇక ఈ సినిమాకు రెమ్యూనరేషన్స్ కూడా బాగానే చెల్లించారు. ఇక ఈ సినిమా పఠాన్ సినిమా కలెక్షన్స్ బ్రేక్ చేయబోతుందని ట్రెడ్ అనాలిస్టులు ఇప్పటికే అంచనా వేశారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా జవాన్ రూ.125 కోట్లు కలెక్ట్ చేయబోతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే జవాన్ సినిమాకు విక్రమార్కుడు, జైలర్ సినిమాకు ఓ లింక్ ఉందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీలో హిందీలో కూడా రీమేక్ చేశారు. విక్రమ్ రాథోడ్ పేరిట అక్షయ్ కుమార్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Do you know the link of Shahrukh Khan Jawan to the movies Raviteja Vikramarkudu and Rajinikanth Jailer?

అయితే విక్రమార్కుడికి, జవాన్ కు లింక్ ఏంటంటే... జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒక క్యారెక్టర్ పేరు అజాద్. మరో క్యారెక్టర్ పేరు విక్రమ్ రాథోడ్. విక్రమార్కుడు సినిమాలో రవితేజ పేరు కూడా విక్రమ్ రాథోడ్. అలా ఈ సినిమాకు జవాన్ సినిమాకు లింక్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.

Do you know the link of Shahrukh Khan Jawan to the movies Raviteja Vikramarkudu and Rajinikanth Jailer?

ఇదిలా ఉంటే మరో సినిమా రజినీ నటించిన జైలర్ మూవీకి జవాన్ కు కూడా లింక్ ఉందని తెలుస్తోంది. రజినీ కాంత్ నటించిన జైలర్ మూవీలో రజినీ కాంత్ జైలర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఇక జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా జైలర్ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరు అజాద్. మొత్తానికి ఈ రెండు సినిమాలకు జవాన్ కు లింక్ ఇదే నంటూ... ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X