Chandra Mohan: శ్రీదేవితో కలిసి చేసిన ఆ సినిమా చంద్రమోహన్ కు నచ్చలేదట.. ఎందుకంటే?

అలనాటి స్టార్ హీరో చంద్రమోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంది కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా మారిన ఆయన ఈరోజు కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయారు. చంద్రమోహన్ మృతి నిజంగానే సినీ రంగానికి తీరని లోటు. ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో నటించిన ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఆయన జీవితంలో చేసిన కొన్ని ప్రత్యేకమైన సినిమాల గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అలనాటి అందాల తార శ్రీదేవికి తొలి హీరోగా చంద్రమోహన్ క్రెడిట్ కొట్టేశాడు. అది కూడా పదహారేళ్లు సినిమాకు. ఈ సినిమాలో చంద్రమోహన్, శ్రీదేవిలు కలిసి నటించారు. 1978 ఆగస్టు 31వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అందాల మల్లిగా శ్రీదేవి, అమాయకుడైన చంద్రంగా చంద్ర మోహన్, పల్లెటూరి పోకిరిగా మోహన్ బాబు ఈ సినిమాలో కనిపించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పిటకీ అందరికీ ఫేవరెట్.

Do You Know The Reaseon Actor Chandra Mohan Did Not Like Padaharella Vayasu Movie

ఈ చిత్రంలోని సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా పాట అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. సినిమా వచ్చి ఇంతకాలం అవుతున్నా ఈ పాటను ఇష్టపడని వారు, మర్చిపోయిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇంత అందమైన చిత్రం, అందులోనూ అలానాటి అందాల తార శ్రీదేవి హీరోయిన్ గా చేసిన సినిమా, బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రం.. అయినప్పటికీ ఇది చంద్రమోహన్ కు నచ్చలేదట. ఈ విషయాన్ని ఆయనే నేరుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని వందల సినిమాల్లో నటించినప్పటికీ ఆయనకు కొన్ని సినిమాలు మాత్రమే నచ్చాయని చెప్పారు.

తాను హీరోగా వచ్చిన తొలి చిత్రం రంగుల రాట్నం అంటేనే తనకు బాగా ఇష్టమని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. అలాగే ఆమె, కలికాలం, సగటు మనిషి వంటి చిత్రాలు కూడా తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చాయని వివరించారు. కానీ పదహారేళ్ల వయసు సినిమా మాత్రం తన మనసును తాకలేదని అన్నారు. ఆ సినిమాతో తనకు చాలా పేరు వచ్చినప్పటికీ ఆ చిత్రం తన ఫేవరెట్ గా నిలవలేకపోయిందని పేర్కొన్నారు. అందుకు ఒకే ఒక్క కారణం అని వెల్లడించారు. పదహారేళ్ల వయసు రీమేక్ చిత్రం కావడమే అందుకు కారణం అని వివరించారు.

Do You Know The Reaseon Actor Chandra Mohan Did Not Like Padaharella Vayasu Movie

భారతీరాజ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా.. మోహన్ బాబు విలన్ గా తమిళంలో పదునారు వయనదిలే అని వచ్చింది. అయితే ఈ సినిమా చాలా బాగుందని భావించిన ప్రొడ్యూసర్ మిద్దే రామారావు... చాలా కష్టపడి మరీ తమిళ ప్రొడ్యూసర్ రాజకన్నును కలిసి రీమేక్ హక్కులు కొనుగోలు చేశారు. ఇలా ఈ చిత్రాన్ని చంద్రమోహన్, శ్రీదేవి, మోహన్ బాబులతో తెరకెక్కించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్టు అయింది. నటీనటులుతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు కు మంచి పేరు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X