Balayya Role in Jailer: జైలర్ మూవీలో బాలయ్య రోల్.. జస్టులో మిస్.. లేదంటే థియేటర్లు బద్దలే!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. బీస్ట్ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ గురువారం థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించాల్సి ఉందట. కానీ ఆ రోల్ అలా మిస్ అయిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
ఫ్లాపుల్లో రజినీకాంత్ కు జైలర్ సినిమా మంచి సక్సెస్ ను ఇచ్చింది. అటు బీస్ట్ మూవీతో విమర్శల పాలైనా నెల్సన్ దిలీప్ కుమార్ కు సైతం ఈ మూవీ విజయాన్ని ఇచ్చింది. ఇక జైలర్ మూవీ గురువారం థియేటర్లకు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన మొదటి రోజే రూ.90కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇక జైలర్ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా.. హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇక ఈ మూవీలో వసంత రవి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజిని అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. అంతేకాదు శివరాజ్ కుమార్ , మోహన్ లాల్ వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో కామియో రోల్స్ పోషించడం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు.
ఇక ఈ క్రమంలోనే మంచి ఆదరణ వస్తుండటంతో... నెల్సన్ దిలీప్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా మిస్ అయింది అనే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలామంది జైలర్ ఏమన్నా మల్టీ స్టారర్ చిత్రమా అని ముందు అనుకున్నారని వెల్లడించారు. కానీ రజనీకాంత్ మాత్రం స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫుల్ జోష్ ఉంటుంది అనుకొని అందుకే ఈ సినిమాను మల్టీ స్టారర్ గా తెరకెక్కించలేదని చెప్పుకొచ్చారు.
Bhola Shankar మేనియాలో జబర్దస్త్ యాంకర్... చిరుతో కలిసి స్టేప్పులు ఇరగదీసిందిగా?
అయితే జైలర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ కోసం శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి హీరోలను పెట్టామమని తెలిపారు.. అయితే ముందుగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణని కూడా ఒక పాత్రలో చేస్తే బాగుంటుందని అనుకున్నాం.. కానీ అది కుదరలేదని వెల్లడించారు. జైలర్ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు బాలయ్య గురించి కూడా ఆలోచన వచ్చిందని వివరించారు.

జైలర్ స్క్రిప్ట్ పూర్తయ్యాక బాలయ్యను తీసుకోవాలన్న పాత్ర సరిగ్గా రాలేదని స్పష్టం చేశారు నెల్సన్.. అందుకే ఆ పాత్రలో ఉన్న బాలయ్యని నటింప చేయడం కరెక్ట్ కాదనిపించి ఆయనను తీసుకోలేదు అంటూ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ వెల్లడించారు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో బాలయ్యతో సినిమా చేస్తానేమో అని చెప్పుకొచ్చారు.
అయితే బాలయ్య జైలర్ సినిమాలో నటిస్తే.. వేరే లెవెల్ ఉండేదని అభిమానులు అంటున్నారు. అసలు రజనీ ప్లేస్ లో బాలయ్య ఉండి ఉంటే కూడా సినిమా బాక్స్ బద్దలయ్యేవని కామెంట్స్ చేస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఈ మూవీ చేసి ఉంటే... భలే ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య, రజినీ స్క్రీన్ చూసే ఛాన్స్ మిస్ అయ్యాం. చూడాలి భవిష్యత్తులో ఈ కాంబోలో మూవీ వస్తుందో లేదో.


Click it and Unblock the Notifications











